కడప

ప్రభుత్వ పథకాలు పేదలకు వరంలాంటివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాయపేట, జనవరి 3: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు వరంలాంటివని శాసన మండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మారుమూల ప్రాంతమైన కల్లూరుపల్లె జన్మభూమి కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ సిద్ధాస్రవంతి అధ్యక్షతన నిర్వహించారు. జన్మభూమికి ముఖ్య అతిధిగా హాజరైన సతీష్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పథకాలు పేదలకు వరంలాంటివన్నారు. చక్రాయపేట మండలానికి వెలిగల్లు నీరు తెప్పిస్తామని వారు భరోసా ఇచ్చారు. జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి గండికోట నీళ్లు ఏ విధంగా తెప్పించానో, అదే విధంగా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి నీళ్లు అందవు కనుక వెలిగల్లు ప్రాజెక్టు నుండి నీటిని తెప్పించేందుకు విశేష కృషి చేస్తున్నామన్నారు. ఏది ఏమైనప్పటికీ మండలానికి వెలిగల్లు నీరు తెప్పించి మండలం సస్యశ్యామలంగా ఉండేందుకు కంకణం కట్టుకుంటానని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జన్మభూమి కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శోభన్‌బాబు 2017 క్యాలెండర్‌ను సతీష్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చినరాముడు, డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రత్యేకాధికారి చాముండేశ్వరి, మాజీ మండలాధ్యక్షుడు రుగ్మాంధరరెడ్డి, ఎంపీడీవో విజయమ్మ, తహశీల్దార్ నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు హరినాధరెడ్డి, మాజీ హార్టికల్చర్ డైరెక్టర్ కర్నాటి నాగభూషణరెడ్డి, ఎస్‌ఐ గోవిందరెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

శరవేగంగా గండికోట ప్రాజెక్టు
కాలువ పనులు

కడప,జనవరి 3: గండికోట రిజర్వాయర్‌నుంచి పులివెందులకు తాగునీరు, సాగునీరు వదిలేందుకు జలవనరులశాఖ అధికారులు రెండురోజులుగా గండికోట ఎత్తిపోతల పథకం వద్ద మకాం వేసిపనులను వేగవంతం చేస్తున్నారు. గండికోట ఎత్తిపోతల నుంచి పైడికాలువ ద్వారా పులివెందులకు నీరు ఇవ్వడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని టిడిపి ప్రభుత్వం ఆపార్టీ నాయకులు ధృఢ సంకల్పంతో పనులు వేగవంతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక దృష్టిసారించి పులివెందులకు నీరు ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకుని ప్రాజెక్టులకు కావాల్సిన నిధులు కూడా మంగళవారం విడుదల చేసినట్లు తెలుస్తోంది. పులివెందులకు తాగునీరు, సాగునీరు ఇచ్చేందుకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి శపథం పూని ఒకటిన్నర సంవత్సరం పాటు గడ్డం పెంచుకున్నారు. మొక్కునిమిత్తం ఆయన తన దైన శైలిలో కృష్ణాజలాలుకోసం అనేక దేవాలయాలు తిరిగి ప్రాజెక్టుల నిర్మాణం కోసం పాదయాత్రలు చేసి గత రెండునెలలుగా చంద్రబాబునాయుడును రోజుమార్చి రోజు సతీష్‌తోపాటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిలు కలిసి కృష్ణాజలాలు అవుకు ప్రాజెక్టు ద్వారా గండికోటకు ఎట్టకేలకు 4టిఎంసిల నీరు పైబడి నింపి, ఈనెల 11న ముఖ్యమంత్రి చేతులమీదుగా నీరును పైడిపాలెం ఎత్తిపోతల పథకానికి అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అలాగే జమ్మలమడుగు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్సీ సి.ఆదినారాయణరెడ్డి గండికోట ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కేటాయించారు. ప్రస్తుతం గండికోటకు చేరిన నీటిలో 1.5టిఎంసిల నీటిని మైలవరం ప్రాజెక్టుకు నీరు తీసుకెళ్లి తద్వారా జమ్మలమడుగు , ప్రొద్దుటూరు తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తున్నారు. జమ్మలమడుగు ప్రాంతంలో కొన్ని గ్రామాల పంటలు కాపాడేందుకు సాగునీరు అందివ్వనున్నారు. టిడిపి అధిష్ఠానంతోపాటు , జిల్లా నాయకులు ప్రత్యేకించి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డిలు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు.