కడప

అధికార, ప్రతిపక్షాల మద్య మాటల తూటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 12:రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేకున్నా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తాజాగా రెండురోజుల నుంచి మాటల యుద్ధం మొదలైంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారపార్టీపై అవాకులు చవాకులు పేలుతుండటం, ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈనేథ్యంలో తెలుగుదేశం పార్టీకి అగ్రనేతలు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అనంతపురం పార్లమెంట్ సభ్యులు జెసి దివాకర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి జగన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై జగన్ ముఖ్య అనుచరుడు రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి చర్చకు సవాల్ విసిరారు. దానికి ప్రతిసవాల్‌గా తాము ఎప్పుడైనా సిద్దమేనని ప్రతి సవాల్ విసిరారు. ఇక వ్యక్తిగత ధూషణలకు కూడా మొదలయ్యాయి. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ప్రస్తావిస్తూ తెలుగుదేశంపార్టీపై వారు సైతం కారాలు, మిరియాలు నూరుతున్నారు. తాజాగ జగన్‌పై హవాలా ఆరోపణలు రాకతో జిల్లా నేతలు మరోమారు జగన్‌పై కాలు రువ్వుతున్నారు. జగన్, జగన్ అనుచరులు సైతం టిడిపి అగ్రనేతల ఆరోపణలు లెక్కచేయకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యం గా జిల్లాలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల లబ్ధికోసం కూడా పరస్పరం దూషణల పర్వం జరుగుతున్నట్లు మేథావుల నుంచి ఆరోపణలు విన్పిస్తున్నాయి. జగన్ తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం, నేతలపై విమర్శలు ఆగేవరకు అధికారపార్టీ నేతలు వైకాపాపై విమర్శలు ఆపేలా కన్పించడం లేదు. బుధవారం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన పురస్కరించుకుని బాబు ఎక్కడ వైకాపా నేతలను కానీ, ప్రతిపక్షపార్టీపై కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కూ డా చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడలేదు. సిఎం సభకు వచ్చిన అధికారపార్టీ నేతలంతా వైసిపి నేతలపై దుమ్మెత్తిపోశా రు. మధ్యలో ముఖ్యమంత్రి జో క్యం చేసుకుని విమర్శలు చేయకుండా ప్రసంగించాలని కోరారు. ఒక దశలో కొంతమంది నేతలపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద జగన్ సొంత జిల్లాలో నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మొదలయ్యాయి. కాగా గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులకు నీరు వదిలిన తర్వాత జగన్‌పై ఎక్కువగా టిడిపి నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారని చెప్పవచ్చు.
నేటి నుండి సంక్రాంతి సంబరాలు
కడప(కల్చరల్), జనవరి 12:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యాదాళ్లపిచ్చయ శెట్టి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 13,14,15వ తేదీల్లో స్థానిక పాతబస్టాండు పక్కన ఉన్న ట్రస్టు ప్రాంగణంలో ప్రతిరోజు సాయంత్రం 6గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు నిర్వాహకులు కామిశెట్టి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలందరూ ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.