కడప

పట్టణాల్లో గస్తీ ముమ్మరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(క్రైమ్)జనవరి 21:దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణాల్లో గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు ప్రధానకార్యాలయంలో జరిగిన క్రైమ్ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు గస్తీ చేయడం వల్ల పలు నేరాలు జరగకుండా ఆపవచ్చునన్నారు. ఎస్సీ, ఎస్టీకేసులతోపాటు పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నామని వాటిని పోలీసు అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని అలా ఇవ్వని అధికారులపై చర్యలు వుంటాయన్నారు. ఖాళీగా ఉన్న పోలీసు ప్రదేశాలు దురాక్రమణలు జరగకుండా కాపాడాలన్నారు. ప్రజలతో మమేకమై ప్రజలకోసం పనిచేస్తే ప్రజల సహకారం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి సత్యయేసుబాబు, జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, అధికారులు పాల్గొన్నారు.

గండికోట వారసత్వ ఉత్సవాలను
విజయవంతం చేయండి

కడప,జనవరి 21: గండికోట వారసత్వ ఉత్సవాలను ఆయా కమిటీలు సమన్వయంతో కేటాయించిన విధులను నిర్వర్తించి విజయవంతం చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో గండికోట వారసత్వ ఉత్సవాలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గండికోట వారసత్వ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 4,5వ తేదీల్లో గండికోట వారసత్వ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీ, కల్చరల్ కమిటీ, వౌలిక సదుపాయాల కమిటి, ఆహారకమిటీ, పారిశుద్ధ్యం, నీటి సరఫరా కమిటీ, ఎగ్జిబిషన్ కమిటీ, ట్రాన్స్‌పోర్టు కమిటీ, సావనీర్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ తదితర 12 కమిటీల కన్వీనర్లు, ఆయా కమిటీలకు సంబంధించిన సభ్యులతో సమావేశాలు ఏర్పాటుచేసుకుని గండికోట వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ముఖ్యకూడళ్లలో ప్రజలకు తెలిసే విధంగా విస్తృతప్రచారం చేయాలని సూచించారు. గండికోట వారసత్వ ఉత్సవాల్లో కేరళ కళాకారులతో కళరీ పట్టు కళాబృందాలతో కార్యక్రమాలు ఉంటాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర వైభవం, ఖవ్వాలి కార్యక్రమాలు ఉంటాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారులచే అన్నమయ్య కీర్తనలు ఉంటాయన్నారు. వౌలిక సదుపాయాల కమిటీ జంగిల్ క్లియరెన్స్, అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. లైటింగ్ డెకరేషన్ ఏర్పాటుచేసి అతి సుందరంగా అలంకారం చేయాలన్నారు. ఆయాశాఖలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి పథకాలపై వివిధ రకాలైన స్టాల్స్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఆయాశాఖలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై వివిధ రకాలైన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలు జరిగే పగటి వేళల్లో సాంప్రదాయ పోటీలైన అల్లెంగుండు, కర్రసాము, అగ్గిబరాట, గాలిపటాలు, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ వంటి పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జెసి శే్వత తెవతియ, రెవెన్యూ అధికారి ఈశ్వరయ్య, పర్యాటకశాఖ ఆర్‌డి గోపాల్, బిసి కార్పొరేషన్ అధికారి రామచంద్రారెడ్డి, సోషియల్ వెల్పేర్ డిడి సరస్వతి, డిఎస్‌ఓ విజయరాణి, కడప, జమ్మలమడుగు ఆర్డీవోలు చినరాముడు, వినాయకం, సిపిఓ తిప్పేస్వామి, డిఇఓ ప్రతాప్‌రెడ్డి, డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, డిటిసి బసిరెడ్డి, డిపివో సుబ్రమణ్యం, స్టెప్ సిఇఓ టి.మమత తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.