కడప

మంత్రి గంటాతో ఎమ్మెల్సీ బత్యాల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 7: జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బత్యాల చెంగల్రాయులు తిరుపతిలోని ఆయన స్వగృహంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సోమవారం బత్యాల చెంగల్రాయులు, రైల్వేకోడూరు టిడిపి ఇన్‌చార్జి కె.విశ్వనాథనాయుడు, ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసినట్లు తెలుస్తోంది. బత్యాల చెంగల్రాయులు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేసే ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షరతులతో కూడిన హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గ అభివృద్ధికి పలు ప్రణాళికలతోపాటు ఆయన రాజకీయ భవిష్యత్‌కు షరతులు విధించినట్లు తెలియవచ్చింది. ఈ నేపధ్యంలో మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతికి పంపి ఆయనతో చర్చించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన తిరుపతికి రావడం, బత్యాల చెంగల్రాయులుకు తన సామాజిక వర్గీయులు, తన నియోజకవర్గంలోని జడ్పీటిసిలు, ఎంపిటిసిలు 50 మంది పైబడి వుండటంతో ఆయన పలువురు కీలకనేతలను తిరుపతికి పిలిపించుకుని గంటా శ్రీనివాసరావుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్‌పార్టీకి చెందిన నేత అయినా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లకు బత్యాల చెంగల్రాయులు మద్దతు ఇచ్చినట్లు పాఠకులకు విధితమే. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆయన ప్రతిపక్షంలోనే కొనసాగుతూ కేంద్రం, రాష్ట్ర బిజెపి, టిడిపి ప్రభుత్వాలపై తారాస్థాయిలో విమర్శలు కూడా చేస్తు వస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షనేత వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్, రాష్టమ్రాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల బరిలో దిగడంతో టిడిపి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే ధ్యేయంగా పెట్టుకుని టిడిపికి భద్ధశతృవులు వచ్చినా పార్టీ అహ్వానిస్తోంది. ఈ తరుణంలో రైల్వేకోడూరు ఎమ్మెల్సీ బత్యాల టిడిపి అభ్యర్థులకు మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి. తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో కూడా చేరతారని వినికిడి. కాగా టిడిపిలో ప్రస్తుతం ఉన్న ఒక వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద రైల్వేకోడూరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం జిల్లాలో కీలకంగా మారనుంది.

18,19న గండికోట ఉత్సవాలు

కడప,్ఫబ్రవరి 7: ఈనెల 18,19వ తేదీల్లో ఘనంగా నిర్వహించతలపెట్టిన గండికోట ఉత్సవాలు విజయవంతం చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండురోజులపాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్నిచర్యలు చేపట్టిందని ఇందుకోసం ముందస్తు కార్యక్రమాలు కూడా ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, గండికోట ప్రాంతాల్లో ఉత్సవాలకు సంబంధించి బెలూన్ల ఎగురవేత ఉంటుందన్నారు. వైవియు తెలుగువిభాగ ప్రొఫెసర్ డా.ఈశ్వరరెడ్డి రచించిన అదిగో అదిగో అల్లదిగో గండికోట గత వైభవం అనే థీమ్‌సాంగ్‌ను జిల్లా సినీగాయకులు శ్రీకాంత్ పాడగా ఆ పాటను కలెక్టర్ ఆవిష్కరించారు. 8వ తేదీ బుధవారం వక్తృత్వ, వ్యాసరచన పోటీలు వైవియులో జరుగుతాయని, 9వ తేదీ ఉదయం 10గంటలకు కవిసమ్మేళనం, 10వ తేదీన జనాపద, లలితగీతాల పోటీలు, 11న కూచిపూడి నృత్యాల పోటీలు కడప కళాక్షేత్రంలో నిర్వహిస్తారన్నారు. 12వ తేదీ గండికోట రన్ ఉదయం 7గంటలకు మున్సిపాల్టీల్లో ప్రారంభమవుతాయని, అదేరోజు కడప మున్సిపల్ స్టేడియంలో ఉదయం 9గంటలకు డాగ్‌షో, 13న సిపి బ్రౌన్ గ్రంథాలయంలో పర్యాటకంపై క్విజ్, 14న మున్సిపల్ స్టేడియంలో ఖో-ఖో, స్కిప్పింగ్, 14న సిపి బ్రౌన్ గ్రంథాలయంలో జూనియర్స్‌కు వక్తృత్వపు వ్యాసరచన పోటీలు, 15న మున్సిపల్ స్టేడియంలో కబడ్డీ, కుస్తీ, 16న కళాక్షేత్రంలో వంటలు, ముగ్గులపోటీలు నిర్వహిస్తారన్నారు. 17న ఉదయం 10గంటలకు కడప నుంచి సాయంత్రం 4గంటలకు ప్రొద్దుటూరు నుంచి, 18వ తేదీ ఉదయం 10గంటలకు జమ్మలమడుగు నుంచి కళాకారులతో శోభాయాత్రర్యాలీ నిర్వహిస్తామన్నారు. 18వ తేదీ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా సాయంత్రం 4గంటల నుంచి గండికోటలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్, కేరళ నుంచి సింగారిమేళా ప్రదర్శన, టిటిడి నుంచి అన్నమయ్య కీర్తనల ఆలాపన, శివారెడ్డి మిమిక్రీ షో, ఖాన్‌టీమ్ తరపున కూడి నృత్యాలు, గంగాధర శాస్ర్తీ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఉంటుందన్నారు. 19న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 5గంటల నుంచి 20 మంది కళాకారులతో భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకలి, రాజస్తాని, ఒడిస్సీ నృత్యాల ప్రదర్శనలు 60మంది కళాకారులతో హనుమాన్ చాలీసా ,నృత్యప్రదర్శన, శ్రీవెంకటేశ్వరవైభవం నాటక ప్రదర్శన, వందేమాతరం శ్రీనివాస్ బృందంచే సంగీత విభావరి, మొయిన్ దిల్‌షాద్ హైదరాబాద్ ఆద్వర్యంలో ఖవ్వాలి ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రజల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్‌కోర్టు ఏర్పాటుచేస్తున్నామని కడప జిల్లా ప్రాముఖ్యతను దశ దిశలా చాటిచెప్పే విధంగా కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్సవాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకావచ్చునని రాజకీయాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసేందుకు వీలులేదన్నారు. జిల్లా ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా కడప నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలు తెలియజేసే పోస్టర్లు, లోగో, స్టిక్కర్లను విడుదల చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శే్వతతెవతియ, టూరిజం ఆర్‌జెడి గోపాల్, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, టూరిజం అధికారి ఖాదర్‌బాషా, ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మి, స్టెప్‌సిఇఓ మమత, సిపిఓ తిప్పేస్వామి, ఆర్డీవో చిన్నరాముడు, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, ఏపిఎం ఐసిపిడి మధుసూదన్‌రెడ్డి, డిఇఓ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఏడురోడ్ల కూడలిలోని సిండికేట్ బ్యాంక్ మేడపై ఉత్సవాల బెలూన్ అధికారులతో కలిసి కలెక్టర్ ఎగురవేశారు.