కడప

ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవిని గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 14: జిల్లా అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిటెక్ రవిని గెలిపించాలని, నేతలు కుమ్ములాటలు వదిలి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం రాత్రి జిల్లా నేతల సమీక్ష అనంతరం మంగళవారం ఉదయం జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) నేతృత్వంలో సిఎంను కలిశారు. ప్రతిపక్షనేత, వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి రాష్టవ్య్రాప్తంగా అభివృద్ధి అడ్డుకుంటున్నారని ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధి జరిగేది ఆయనకు ఇష్టంలేదని ఈ తరుణంలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని లేనిపక్షంలో పార్టీ ఉనికి కోల్పోయి, పార్టీకి భవిష్యత్ ఉండదని ఆయన నేతలకు హితబోధ చేశారు. తానెప్పుడూ కడప జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తానని గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యేను మాత్రమే గెలిపించారని అయితే తాను జిల్లాపై సవతితల్లి ప్రేమ చూపించకుండా ప్రత్యేకించి అత్యంత వెనుకబడిన కడప జిల్లాను ఆదుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నానని ఆయన గుర్తు చేసినట్లు నేతలు తెలిపారు. తాను ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరగాపూర్తిచేసి సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ముఖ్యమని, ఇందులో కడప జిల్లాకే ప్రాముఖ్యత ఇచ్చి ఇటీవల కృష్ణా జలాలు జిల్లాకు ఇచ్చిన ఘనత తమదే అన్నారు. తాగునీరు, సాగునీరు కొరత జిల్లాలో పూర్తిగా తీరుస్తానని, జిల్లా అభివృద్ధికి అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నానని ఈ తరుణంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి నేతలు తమ సత్తా నిరూపించుకుని ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి గుణపాఠం నేర్పించాలని ఆయన నేతలకు పదే పదే సూచించినట్లు తెలిసింది. జగన్మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే ఆయన కుటుంబం 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఏనాడు సాగునీరు, తాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన కూడా తమను, ప్రభుత్వాన్ని విమర్శించడం ఆయనకు అర్హత లేదని దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని నేతలంతా స్పర్ధలు విడనాడి స్థానిక సంస్థల అభ్యర్థిగా బిటెక్ రవిని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెజెరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చలపుల్లయ్యను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వారం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు విచారిస్తున్నామని ఈ తరుణంలో నేతలంతా స్పర్ధలు విడనాడి పనిచేయాలని ఆయన సూచించారు.

భక్తులతో కిక్కిరిసిన పెద్దదర్గా
కడప,(కల్చరల్)్ఫబ్రవరి 14: భక్తి పారవశ్యానికి పెట్టింది పేరు ఆస్థాన -ఏ-ముగ్దూముల్లాహి. గత ఐదు రోజుల నుంచి పెద్దదర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాలకు జిల్లా వాసులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ప్రతిరోజు జరిగే ఉరుసు తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉరుసు ప్రారంభం నుండి ఒక పండుగ వాతావరణంగా మారింది. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఉరుసు సందర్భంగా వారి వారి బంధువుల ఇళ్లకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఉరుసు జరిగినన్ని రోజులు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు వివిధ రకాల ఆకర్షణీయమైన వస్తువులతో అంగళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా పింగాణి, స్టీలు, మహిళలకు కావల్సిన అలంకరణకు ఉపయోగపడే పలు రకాల రోల్‌గోల్డ్ నగలు, ఇతర వస్తువులు, పిల్లల ఆటవస్తువులు, ఇంటిలో అవసరమైన ఎటువంటి చిన్న వస్తువైనా ఉరుసులో లభించే విధంగా ఉన్నాయి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూమార్తెలకు ఇచ్చే వివిధ రకాల ఇంటి అవసరాల వస్తువులు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఉరుసు రోజుల్లో పెద్దలు, పిల్లలతో అంగళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా మహిళలు వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆస్థాన నిర్వాహకులు ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోకి పురుషులకు ప్రవేశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉరుసులో పిల్లల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఉరుసులో పిల్లలకు కోసం ఏర్పాటుచేసిన జెయింట్ వీల్, కొలంబస్, హెలికాప్టర్, రకరకాల ఉయ్యాలలు మనోరంజకమైన, వినోదాత్మకమైన ప్రదర్శనలు చూసేందుకు పిల్లలకు ఎగబడుతున్నారు. పిల్లలను ఆకర్షింపజేసే ఆట బొమ్మల వస్తువులు అంగళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఉయ్యాలలో తిరిగేందుకు, ఆటవస్తువులు కొనుగోలు చేసేందుకు పిల్లలు పడే సంబరం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఆనందంగా ఉయ్యాలల్లో ఊగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఉరుసు జరిగే ప్రదేశం అంతా పిల్లలు, పెద్దలతో కిక్కిరిసిపోతోంది. దర్గా ఆవరణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రదేశంలో ప్రతిరోజు రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు జరిగే ఖవ్వాలి కార్యక్రమాన్ని విని పరవశిస్తున్నారు. ఉరుసు జరిగే రోజుల్లో రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రముఖ ఖవ్వాలి బృందాలు పాల్గొని కచేరిలు ఇస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున జాతీయ ముషాయిరా కూడా జరిగింది. దేశంలో పేరుగాంచిన ప్రఖ్యాత ఉర్దూ కవులు ఈ ముషాయిరాలో పాల్గొని తమ గానాన్ని వినిపించారు.