కడప

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ ఆదర్శపాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 14: రాష్ట్రప్రభుత్వం 2013లో ఎంతో అట్టహాసంగా కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఆదర్శ పాఠశాలలను నెలకొల్పి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తుండటంతో ఆదర్శపాఠశాలల ప్రవేశానికి బాగా డిమాండ్ పెరిగింది. వచ్చేనెల 5వ తేదీన 6వ తరగతి ప్రవేశపరీక్షకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో రామాపురం, ఖాజీపేట, పులివెందుల, కాశినాయన, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, వల్లూరులలో ఆదర్శపాఠశాలలు ఉన్నాయి. 2017-18వ సంవత్సరానికిగాను 6వ తరగతి ప్రవేశపరీక్ష నిర్వహించి 80సీట్లు కేటాయిస్తారు. ఆదర్శపాఠశాలలో ప్రవేశానికి తెలుగు, ఇంగ్లీషులో విద్యార్థులు తమకు అనుకూలమైన భాషలో ప్రవేశపరీక్షలు రాయవచ్చు. అయితే ఆదర్శపాఠశాలల్లో ప్రవేశానికి 4,5 తరగతుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసివుండాలి. 8వ తరగతికి 80సీట్లు ఉండగా, 15శాతం ఎస్టీలకు, 5శాతం ఎస్సీలకు, 29 శాతం బిసిలకు, బిసి ఏ-కు 7శాతం, బిసి బికి 10శాతం, బిసి సికి ఒక శాతం, బిసిడి 7శాతం, బిసి ఇకి 4శాతం, వికలాంగులకు 3శాతం, బాలికలకు 33.33శాతం, ఓసిలకు 39శాతం చొప్పున సీట్లు కేటాయించారు. ప్రవేశపరీక్ష కూడా 5వ తరగతి సిలబస్ పైనే తెలుగు, ఇంగ్లీషు, గణితం పరికరాల విజ్ఞానంపైనే 25మార్కులు చొప్పున ప్రశ్నలు ఉంటాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకంటే ఆదర్శపాఠశాలల్లో అత్యంత అనుభవం ఉండి ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉండటం, ఇంగ్లీషులో విద్యాబోధన చేయడం వివిధ పోటీపరీక్షలకు, ముఖ్యంగా ఉచిత పుస్తకాలు, యూనిఫాం, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయాలతో ఆదర్శపాఠశాలలు ఏర్పాటుచేయడంతో ఈ ఏడాది ఆదర్శపాఠశాల ప్రవేశాలకు బాగా డిమాండ్ పెరిగింది. వచ్చే ఏడాది ప్రవేశాలకు ఈనెల 4లోపే దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారులు స్వీకరించారు. వాటిని ఇప్పటికే పరిశీలించి హాల్‌టికెట్లు కూడా విద్యార్థులకు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

భారతి సిమెంట్స్‌లో ప్రమాదం
కాంట్రాక్టు కార్మికుడి మృతి

కమలాపురం, ఫిబ్రవరి 14: మండల పరిధిలోని నల్లింగాయపల్లె భారతి సిమెంట్సులో మంగళవారం విధినిర్వహణలో రైల్వేట్రాక్‌లో బొగ్గు అన్‌లోడ్ చేసిన అనంతరం షంటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మహబూబ్‌బాష (36) అనే కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా తలుపుల మండలం పెద్దన్నగారి పల్లె గ్రామానికి చెందిన మహబూబ్‌బాష మూడేళ్ల క్రితం తన కుటుంబ సభ్యులతో కలసి భారతిసిమెంట్సులో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు మృతుని భార్య తహరాబీ తమకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగిగా భారతిసిమెంట్సులో గూడ్స్‌రైలు షింటింగ్ చేసే పనిచేస్తున్నట్లు తెలిపారన్నారు. ఐతే ఎప్పటిలాగే సోమవారం రాత్రి నైట్‌షిప్ట్‌పై ఫ్యాక్టరీలోకి వెళ్లి షింటింగ్ చేస్తున్న సమయంలో మంగళవారం ప్రమాదవశాత్తు రెండువ్యాగన్లు కలిపేటప్పుడు వ్యాగన్ ఇనుపరాడ్ అకస్మాత్తుగా శరీరానికి బలంగా తగలడంతో రైలుకింద పడి మృతి చెందినట్లు ఆమె తమకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కాగా విషయం తెలిసిన వెంటనే యర్రగుంట్ల సిఐ రాజేంధ్రప్రసాద్, ఎస్సై మహమ్మద్ రఫీ ప్రమాద సంఘటనపై విచారణ జరిపి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇదిలా ఉండగా భారతిసిమెంట్సులో ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగి మహబూబ్‌బాష కుటుంబానికి యాజమాన్యం రూ. 25లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ తెలుగు దేశం నేత సుధా అంకిరెడ్డి ఆధ్వర్యంలో బాషా సోదరుడు రసూల్, బంధువులు మంగళవారం ఫ్యాక్టరీ మెయిన్‌గేటు సమీపంలో ధర్నాకు దిగారు.
మృతుని మరణవార్త యాజమాన్యం తమకు తెలియచేయలేదని, పేదవారమైన తమ కుటుంబానికి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని మృతుని సోదరుడు డిమాండ్ చేశాడు. అలాగే సిమెంట్సు యాజమాన్యం మృతుని కుటుంబాన్ని ఆదుకోక పోతే ఆందోళన కొనసాగిస్తామని టిడిపినేత అంకిరెడ్డి హెచ్చరించారు. పరిహారంతో పాటు ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులు సమగ్ర యాజమాన్య
పద్ధతులు పాటించాలి
కమలాపురం, ఫిబ్రవరి 14: రైతులు శనగపంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులను సాధించినప్పుడే అధిక దిగుబడిని సాధించవచ్చునని తిరుపతి వ్యవసాయ పరిశోధనాకేంద్రం శాస్తవ్రేత్త డాక్టర్ టిసియం నాయుడు సూచించారు. ఆయన మండల పరిధిలోని యర్రగుడిపాడులో జరిగిన రైతువిజ్ఞాన సదస్సులో కర్షకులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుచేసే పప్పు్ధన్య పంటల్లో రబీసీజన్‌లో 5.5లక్షల హెక్టార్లలో శనగపంటను సాగు చేస్తున్నారన్నారు. ఇందువల్ల మన రాష్ట్రం శనగ ఉత్పాదకతలో ముందంజలో ఉందన్నారు. ఇందుకు కారణం అధికంగా దిగుబడినిచ్చే శెనగ రకాలు సాగుచేయడమేనన్నారు. అంతేకాక పంటసాగులో విప్లవాత్మకమైన యాంత్రీకరణ పద్ధతులు కూడా దోహదం చేసాయన్నారు. రైతులందరూ ఖరీఫ్ తర్వాత దేశవాళి రకాలైన జేజి 11, నంద్యాల శనగ 1, జేజి 130, కాబూజి రకాలు శే్వత, కెఏకె 2, తదితర విత్తనాలను తప్పనిసరిగా సాగు చేసి అధిక నికర ఆదాయం పొంద వచ్చునన్నారు. అలాగే ఖరీఫ్‌లో కొర్రపంటను సాగుచేసుకుని తదుపరి రబీలో శనగ సాగుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కృషి విజ్ఞానకేంద్రం కడపకు చెందిన ప్రోగ్రాం కో ఆర్డీనేటర్ వీరయ్య, శాస్త్ర వేత్తలు రామలక్ష్మిదేవి, స్వర్ణలతాదేవి, వినోద్‌కుమార్, అంకయ్య స్థానిక సబ్ వ్యవసాయ సబ్ డివిజన్ ఏడిఏ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.