కడప

అంగరంగ వైభవంగా రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 11: మరో అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగర ఒంటిమిట్ట కోదండ రామస్వామి రథయాత్రను చూసి తరించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం స్వామివారి రథోత్సవం రామనామస్మరణల మధ్య ముందుకు సాగింది. రథోత్సవం తిలకించేందుకు రెండుకన్నులు చాలవంటే అతిశయోక్తి కాదు. శోభాయమానంగా నిర్వహించిన కోదండరాముని రథయాత్రలో ఇసుక వేస్తే రాలనంతగా వేలాది మంది ఒంటిమిట్టలో పోటెత్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు మంగళవారం ఉదయం 10-30 గంటల సమయంలో కోదండపాణి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. సోమవారం రాత్రి సీతారాముల కల్యాణోత్సవం అనంతరం గజవాహనంపై ఊరేగిన శ్రీరాముడు మంగళవారం తమ్ముడు లక్ష్ముణస్వామితో కలసి తిరుమంజన పూజలో పాల్గొన్నారు. వేద పండితులు వేదోక్తంగా తిరుమంజన పూజలో అలంకరించి ఆలయంలో ప్రదక్షిణం చేస్తూ సీతాసమేత లక్ష్ముణస్వామి రథోత్సవంలో ఆసీనులయ్యారు. సంప్రదాయబద్ధంగా మండల స్థాయి అధికారులు, వేద పండితులు, టిటిడి సిబ్బంది, ఆచార్యులు తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవ మహాశోభాయాత్రను చేపట్టారు. జై శ్రీరామా, జై జై శ్రీరామా అనే నినాదాలతో మాడవీధుల గుండా రథోత్సవం ప్రారంభమైంది. అక్కడ నుండి గ్రామోత్సవం ద్వారా బయలుదేరిన రామయ్య శోభాయాత్ర ఒకటిన్నర గంటలకు స్థానిక బురుజు వద్దకు చేరింది. అక్కడ నుండి సాయంత్రం 4-30 గంటలకు రథయాత్ర ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు యధా స్థానం చేరింది. స్వామి యధా స్థానం చేరిన తర్వాత భక్తులు స్వామివారికి కాయ, కర్పూరాలు సమర్పించారు. ఇదీలా ఉండగా మూలవిరాట్‌లైన శ్రీ సీతారామలక్ష్ముణులను దర్శించేందుకు భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. కల్యాణం అనంతరం సీతారాములను దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాడ విశ్వాసంతో భక్తకోటి రామయ్యను దర్శించి పునీతులయ్యారు. మొత్తం మీద కోదండ పాణి రథయాత్ర మహా అద్భుతం, అద్భుతమన్న రీతిలో సాగింది.
అలరించిన ఉపన్యాసం,
ఊంజల్ సేవ
సీతారాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు ఉదయం కడపకు చెందిన హాయగ్రీవాచార్యులచే చెప్పబడిన రామాయణం జీవిత పరామార్ధం అనే ధార్మిక ఉపన్యాసం భక్తులను ఆకట్టుకుంది. తిరుపతికి చెందిన జంగాల కృష్ణకుమారి ఆలపించిన హరికథా కాలక్షేపం భక్తులను ఆకట్టుకుంది. సాయంత్రం సీతారాములకు ఊంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేడు కాళీయ మర్ధన అలంకారం, అశ్వ వాహన సేవ
బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు బుధవారం ఒంటిమిట్ట కోదండ రామస్వామి కాళీయ మర్ధన అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అనంతరం బుధవారం రాత్రి అశ్వ వాహనంపై సీతా సమేత లక్ష్ముణస్వామి, కోదండ స్వామికి భక్తకోటికి దర్శనమివ్వనున్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతోనే
నేరాలు తగ్గుముఖం..

కడప,ఏప్రిల్ 11: సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాలు అదుపు చేయగలమని రాయలసీమ జోన్ ఐజి శ్రీ్ధర్‌రావు పేర్కొన్నారు. జిల్లాలో సాంకేతిక శిక్షణ ఇప్పించడంలో ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రామకృష్ణ తీసుకున్న చర్యలు అభినందనీయమని శుక్రవారం రాయలసీమజోన్ ఐజి ఎన్.శ్రీ్ధర్‌రావు పేర్కొన్నారు. కడప నగర శివారులోని చింతకొమ్మదినె్న మండలం అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు సిబ్బందికి ఇస్తున్న సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా
డేటా అనాలసిస్, ఇనె్వస్టిగేషన్ వర్క్ షాప్‌లో ఆయన మంగళవారం ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు సైబర్ నేరాలు, కిడ్నాప్‌లు, దొంగతనాలు, జూదాలు, ట్రాఫిక్ సమస్య, అత్యాచారాలు, హత్యలు, ఫ్యాక్షనిజం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పసిగట్టి అనేరాలు ఎదుర్కొని శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఎంతోదోహదపడుతుందన్నారు. ప్రతి పోలీసు మొదలుకుని అధికారుల వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తు.చ తప్పక తెలుసుకుని శాంతి భద్రతలు మెరుగుపరచుకోవాలని ఆయన కోరారు. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు, అధికారులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడంలో తీసుకున్న ప్రత్యేక చొరవ తరహాలో రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా ఎస్పీలు చొరవ తీసుకుని డేటా అనాలసిస్ అండ్ ఇనె్వస్టిగేషన్ వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. రాయలసీమ రేంజ్ టెక్నికల్ హబ్‌గా రాష్ట్రంలో రోల్డ్‌మాల్డ్‌గా తీర్చి దిద్దుతామని ఐజి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డిఐజి పివి రమణకుమార్, ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, అదనపు ఎస్పీ ఆపరేషన్స్ సత్యయేసుబాబు, కడప డిఎస్పీ అశోక్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడీ కేంద్రాలకు
నాశిరకం సరుకులు సరఫరా..!

కడప,ఏప్రిల్ 11: అంగన్వాడీ కేంద్రాలకు నాశిరకం సరుకులు సరఫరా చేస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయ. అంగన్వాడీ కేంద్రాల్లోని పసిపిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పంపిణీ చేస్తున్న సరుకుల్లో నాణ్యతలోపించి పుచ్చులు, రాళ్లతో కలిసిన నాశిరకం సరుకులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 15 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో 3621 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరునెలల నుంచి 3సంవత్సరాల్లోపు పసిపిల్లలకు 1,14750 మంది ఉన్నారు. మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు వయస్సు కలిగిన పిల్లలు 1,04369 మంది ఉన్నారు. 24వేలు మంది పైబడి గర్భవతులున్నారు. 26వేల మంది బాలింతలు ఉన్నారు. అన్నా అమృతపథకం, అనుబంధ పోషకాహారం, పర్యవేక్షణ పోషకాహారం, బాలల పరిరక్షణ యూనిట్, శిశుగృహ, బాలసదనాలు ఉన్నా వారికి అందించే పాలు, గుడ్లు, సంపూర్ణ్భోజనం కింద అన్నం, పప్పు, సాంబారు, ఆకుకూరలు సరఫరా చేయాల్సివుంది. అన్నా అమృతహస్తం కింద 3కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర్థలీటరు నూనె, 8గుడ్లు ఇళ్లకు తీసుకెళ్లేందుకు పంపిణీ చేయాల్సివుంది. అనుబంధ ఆహారం కింద 15ప్రాజెక్టుల్లో అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పోషకాహారం అందించాల్సివుంది. అన్నా అమృత హస్తంకింద మాత్రం శిశు,మాతృమరణాలు తగ్గించేందుకు ప్రొద్దుటూరు, రాయచోటి , పోరుమామిళ్ల, పులివెందుల, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, బద్వేలు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. పౌరసరఫరాల శాఖ గోదాము నుంచి సరఫరా అయ్యే బియ్యం, కందిపప్పులో పుచ్చులు, రాళ్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నాణ్యతలోని బియ్యం సరఫరాతో పౌష్టికాహారం పూర్తిగా లోపించి ప్రభుత్వం సరఫరా చేసే ఆహారం పసిపిల్లలు, బాలబాలలు, బాలింతలు, గర్భిణీలు తిని ఉన్న ఆరోగ్యం క్షీణించే విధంగా కందిపప్పు, బియ్యం నాణ్యతలేని కారణంగా ఆహారం సప్పగా ఉంటుంది. వాటిని సరఫరాచేసే కాంట్రాక్టర్లు మాత్రం తమకు గిట్టుబాటు కావడంలేదని బాహాటంకంగా చెప్పుకుంటున్నారు. గిట్టుబాటుకాకపోతే ఎందుకు పోటీపడి టెండర్లు వేసి తమపిల్లలు, తమ కడుపులు ఎందుకుకొడుతున్నారని పేదల నుంచి విమర్శలు వస్తున్నాయి. కోడిగుడ్ల పరిమాణం కూడా చాలా చిన్నవిగానే ఉన్నాయి. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరపతి కలిగిన కార్యకర్త నుంచి సూపర్‌వైజర్, అంగన్వాడీ ప్రాజెక్టు ఆఫీసర్, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈవ్యవహారంపై సమగ్రవిచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని పేదలకు నాణ్యత కలిగిన ఆహారం అందించి, పసిపిల్లలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నమ్మకానికే ఓటర్ల పట్టం

రాయచోటి, ఏప్రిల్ 11: ఇటీవల జరిగిన మునిసిపాలిటీలోని 4, 12వ వార్డుల ఉప ఎన్నికల్లో విలువలు, నిజాయితీ, నమ్మకానికే ఓటర్లు పట్టం కట్టారని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజల అభిమానం ముందు అధికారం, ధనబలం, కుమ్మక్కు రాజకీయాలు పనిచేయని ఓటర్లు నిరూపించారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయచోటి వాసులు అన్ని వేళలా అండగా నిలబడుతున్నారని వారి రుణం తీర్చుకోలేమన్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రజల తీర్పును ఇచ్చారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులకు విజయాన్ని అందించిన ఆ వార్డుల ఓటర్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆ అభ్యర్థుల గెలుపునకు కృషిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కౌన్సిలర్లకు ఆయన పేరు పేరునా దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాయచోటి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పం, పట్టుదలతో ఉన్నానని, అధికారం లేకపోవడం, పై నుంచి నిధులు రాకపోవడంతో ఆశించిన మేర అభివృద్ధి జరగడం లేదన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుంచుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత బాధ్యత, దీక్షతో జీవితాంతం నియోజకవర్గవాసులకు సేవ చేస్తూనే ఉంటానని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

టీడీపీ పాలన అవినీతిమయం
సుండుపల్లె, ఏప్రిల్ 11: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని వైసీపీ జ్లి అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ మండల కన్వీనర్ ఆనందరెడ్డి నిర్మిస్తున్న ఇంటిని రాత్రిపూట చప్పిడి మహేష్‌నాయుడు తన అనుచరులతో కలిసి కూల్చేయడం టీడీపీ నాయకుల ఆగడాలను చూస్తే టీడీపీ పాలన ఎలా సాగుతోందో అర్థమవుతున్నదన్నారు. మండల కన్వీనర్ ఇంటిని కూల్చేయడం తగదని విమర్శించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళతామని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో దౌర్జన్యాలు, అవినీతి పాలన సాగుతోందనేందుకు ఇంతకంటే మరొక నిదర్శనం అవసరం లేదన్నారు. జిల్లాలో టీడీపీ నాయకులు ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసేది సరిపోక ఇండ్లను సైతం కూల్చేందుకు తెగించడం టీడీపీ అసమర్థ పాలనకే సాధ్యమని విమర్శించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో 50 మంది అనుచరులతో కలిసి టీడీపీ నాయకులు ఈ పనికి తెగించారని వారిపై కేసులు నమోదు చేయాలని రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అజంతమ్మ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్‌నాయుడు, ఉపసర్పంచ్ సిరాజుద్దీన్, క్రిష్ణంరాజు, రవికుమార్‌రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఇర్ఫాన్, చిన్నప్ప, సాయి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

మతసామరస్యతకు ప్రతీక
కమలాపురం ఉరుసు

కమలాపురం, ఏప్రిల్ 11: మతసామరస్యతకు ప్రతీక కమలాపురం ఉరుసు అని కడప ఎమ్మెల్యే అంజాద్ బాష పేర్కొన్నారు. ఆయన మంగళవారం రాత్రి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా స్థానిక గఫార్‌షాఖాద్రీ పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు దర్గా ఏ కమిటీ తరఫున అద్యక్షుడు జియా ఆధ్వర్యంలో దర్గా సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయన తలపై పూలచాదర్ల బుట్టను ఉంచుకుని దర్గా వద్దకు రాగా డప్పులు, వాయిద్యాల మధ్య లోపలికి చేరుకుని దర్గాలోని మహానీయుల మజర్లపై పూలచాదర్లను కప్పి పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతేహా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను దర్గా పీఠాధిపతి దుశ్శాలువ కప్పి పూలమాల, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఆయన వైసిపి రాష్ట్ర మైనార్టీసెల్ తరఫున ఉరుసు ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కడప మైనార్టీ సెల్ కన్వీనర్ షంషీర్, జిల్లా రైతువిభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి, పట్టణాధ్యక్షుడు పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ఆయన దర్గా ఆవరణంలోపూర్వపీఠాధిపతి జహిరుద్దీన్ షాఖాద్రీ సమాధిని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఇలా ఉండగా ఉరుసు ఉత్సవాలను కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మంగళవారం సందర్శించి దర్గాలో పీఠాధిపతి గఫార్‌షాఖాద్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆయనను కూడా దర్గా ఏ కమిటీ అధ్యక్షుడు జియా పీఠాధిపతి ఆధ్వర్యంలో దుశ్శాలువ కప్పి సత్కరించారు. అనంతరం శ్రీనివాసులురెడ్డికి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సలీమాఖాదర్‌బాష స్వాగతం పలికి సత్కరించారు. పంచాయతి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు అందేలా తన వంతు సాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

బడుగుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే..

కడప,ఏప్రిల్ 11: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కెవి సత్యనారాయణ మొదట పూలే చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరతరాలుగా అన్ని విధాల అణచివేతకు గురైన బడుగు బలహీనవర్గాలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించి నాటి సమాజంలోని అసమానతలు, కులరక్కసిని సమూలంగా రూపుమాపిన జ్యోతిరావు పూలేకు మహాత్మాఅని పేరు వచ్చిందన్నారు. కులాలకు మతాలకు అతీతంగా నిస్వార్థంగా అట్టడుగున ఉన్న ప్రజలకు సేవలందించారని, ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, 190 సంవత్సరాల పూర్వం ఆయన అందించిన మార్గదర్శకాలు ఈనాటికి కొనసాగుతుండటం గర్వకారణమన్నారు. రాష్ట్రప్రభుత్వం బలహీనవర్గాలకోసం వివిధ అభివృద్ధి సంక్షేమపథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఈ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 160కి పైగా బిసిలకు వసతి గృహాలు ఉన్నాయని, గత ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణతతో 99.64శాతం ఉందని, బిసిలు వివిధ పథకాల ద్వారా 1.50 లక్షల మంది లబ్ధిదారులకు రూ.117కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసిందన్నారు. జిల్లా నుంచి విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం నుంచి 18 మంది వెళ్లారని ఒక్కొక్కరికి రూ.10లక్షలు వ్యయంతో విద్యాభ్యాసానికి ఖర్చు చేస్తోందన్నారు. రాబోయే సంవత్సరంలో ఒక్కొక్కరికి రూ.20లక్షల వ్యయంతో ప్రభుత్వం విదేశీ విద్యాభ్యాసానికి కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బిసి సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. జిల్లాలో బిసి స్టడీ సర్కిల్, బిసి భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జడ్పీ చైర్మన్ గూడరు రవి మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికోసం కృషి చేసి ప్రజల మన్ననలు పొందిన మహావ్యక్తి మహాత్మాజ్యోతిరావుపూలే అని ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని వెనుకబడిన కులాలకు సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకోసం ప్రవేశపెట్టిన పథకాలు కలెక్టర్ సక్రమంగా అమలుజరుగుతున్నాయని అధికారులు కూడా అందుకు సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులసంఘాల నాయకులు అవ్వారు మల్లికార్జున, ఖాదర్‌బాషా, జెవి రమణ, జయచంద్ర, రవి, లక్ష్మిదేవి, నాగేశ్వరరావు, బిసిసంక్షేమాధికారి వెంకటయ్య, బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, సోషల్‌వెల్ఫేర్ డిడి సరస్వతి, సిపిఓ తిప్పేస్వామి, ఎస్‌ఎస్‌ఏపిడి వెంకటసుబ్బయ్య, కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, మైనార్టీ సంక్షేమాధికారి ఖాదర్‌బాషా, గిరిజన సంక్షేమాధికారి లలితాభాయి, ఆర్డీవో చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.

మాతృమూర్తులకు సన్మానం
ఖాజీపేట,ఏప్రిల్ 11: మండలం నలుమూలల నుంచి మాతృమూర్తులను పిలిపించి విద్యార్థుల చేత పూజింపచేసిన కార్యక్రమం మంగళవారం జరిగింది. స్థానిక సెయింట్‌మేరీస్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి దాదాపు 200 మంది మాతృమూర్తులకు పసుపుకుంకుమతోపాటు చీర, సారె సైతం ఇచ్చి విద్యార్థుల చేత పాదాభివందనం చేయించారు. ఆదిలక్ష్మి నుంచి మాతృమూర్తే ప్రధాన భూమిక పోషిస్తోందని కొనియాడారు.
నేటి నుంచి నీరు-చెట్టు అమలు
కమలాపురం, ఏప్రిల్ 11: స్థానిక మైనర్ ఇరిగేషన్‌శాఖ చెరువులో బుధవారం నుంచి నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఎంపిపి సులేఖ మంగళవారం తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం చూపి ఉచితంగా చెరువులోని మట్టిని తమ భూములు సారవంతం చేసుకునేందుకు తీసుకువెళ్లవచ్చునని తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలను అమలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.