కడప

మాట తప్పిన చంద్రబాబు ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, అక్టోబర్ 20: ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నెరవేర్చని హామీలను గుర్తించి గద్దెనెక్కారని జిల్లా వైసిపి రైతువిభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం పట్టణంలోని పలు ముస్లిం కాలనీల్లో పాతకచ్చేరి వీధిలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే దివంగత నేత వైయస్సార్ హయాంలో అమలైన సంక్షేమపధకాలు ఏ మేరకు లబ్ది పొందారో అనే విషయాన్ని తెలుసుకుని వారిని జాతీయ పార్టీ కార్యాలయానికి సెల్ ద్వారా మాట్లాడించి వైయస్సార్ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఇంటింటికి దివంగత నేత వైయస్సార్ స్టిక్కర్‌ను అతికించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరని హామీలిచ్చి ఆ హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రైతులకిచ్చిన శనగలు నాణ్యత లేకుండా పోవడంతో అవి రైతులకే మాత్రం ఉపయోగపడలేదని అన్నారు. ఇందుకుతోడు బహిరంగమార్కెట్ సబ్సిడీ ధరకు పెద్ద తేడా లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేయడంలో రైతులు విముఖత వ్యక్తం చేశారన్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు

రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం..

రాజంపేట, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ముఖ్య పట్టణాల్లో బీసీలతో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం రాజంపేట ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 22న రాజమండ్రిలో 2 లక్షల మంది బీసీలతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ భారీ బహిరంగసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తిరుపతి, అనంతపురం, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర పట్టణాల్లో బీసీలతో భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నదే తన ధ్యేయమన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో 27శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థలలో 34శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని ఆర్.కృష్ణయ్య కోరారు. మెరిట్‌లో వచ్చిన బీసీ వారిని ఓపెన్ కాంపిటీషన్‌లో భర్తీ చేయాలని, కులాలు, వర్గాల ప్రమేయం లేకుండా రహస్య ఓటింగ్ పద్దతిలో ఇంటర్వూలు నిర్వహించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.