కడప

మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, అక్టోబర్ 20: మరుగుదొడ్ల నిర్మాణంలో కడప జిల్లా వెనుకబడి ఉందని, ఈ యేడాది మార్చిలోపు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేసి, జిల్లాను ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు అందరూ కృషిచేయాలని జెసి శే్వత పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మండల సభాభవన్‌లో మండల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మొట్టమొదటగా మరుగుదొడ్ల నిర్మాణంపై సర్వే పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోలేని వారిని గుర్తించి వారి వివరాలను ఏ రోజుకు ఆ రోజు నివేదికను ఆన్‌లైన్ లో నమోదు చేయాలన్నారు. అంద రూ పనిచేసినా సరియైన ఫలితాలు రా వడం లేదని, గ్రామాల్లో నియమించిన అధికారులు క్రిందిస్థాయి అధికారులను చైతన్యపరస్తూ పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. సర్వే 90 శాతం పూరె్తైనా ఆన్‌లైన్‌లో 10 శాతమే నమోదు కావడంతో అధికారులకు తప్పుడు సమాచారం అందుతుందన్నారు. తాను ఐదు నియోజకవర్గాలలో ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నానని, అన్ని నియోజకవర్గాల అధికారులు మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేసి జిల్లాను ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించాలన్నారు. మండలంలో టివి పురంలో గత సంవత్సరం వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావడంతో ఓడిఎఫ్‌గా ప్రకటించడమైందన్నారు. మండలంలో 2031 మందిని మరుగుదొడ్లు లేని వారిగా గుర్తించడం జరిగిందని, వారు పూర్తిస్థాయిలో నిర్మించుకునేలా చూడాలన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్ శ్రీనివాసులు, ఎంపిడిఓ మల్లీశ్వరి, తహశీల్దార్ చంద్రశేఖర్, ఈఓఆర్డీ ప్రసాద్, ఏఓ నాగలక్ష్మి, ఆర్‌ఐ పాల్గొన్నారు.

108 చీరలతో అమ్మవారికి ప్రత్యేక అలంకారం

పోరుమామిళ్ల,అక్టోబర్ 20: పట్టణంలోని శ్రీబాలత్రిపురసుందరీదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో కార్తీక మాసోత్సవం తొలి శుక్రవారం పురస్కరించుకుని శ్రీబాలత్రిపురసుందరీదేవి అమ్మవారికి 108 చీరలతోప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుశర్మ ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామున అభిషేకం, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాసంలో శివునికి ప్రత్యేక పూజలు చేసినా, అభిషేకాలు చేసినా శివాలయంలో దీపాలు వెలిగించినా ఆయురారోగ్యాలు, మాంగల్యబలం చేకూరుతుందన్నారు. ప్రతి సోమవారం, శుక్రవారం వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు, స్వామివార్లు దర్శనమిస్తారన్నారు. కార్తీకమాసం 30రోజుల్లో నిత్య అభిషేక అర్చనలు ఉంటాయన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సత్యనారాయణరెడ్డి, గౌరవాధ్యక్షుడు తులసీ సుధాకర్, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.