కడప

పాఠశాలల అభివృద్ధికి రూ. 4848 కోట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 20: రాష్ట్రంలోని పాఠశాలల్లో వౌళిక వసతులు కల్పనకు మొదటిదశలో రాష్టవ్య్రాప్తంగా 7500పాఠశాలల్లో రూ.4848 కోట్లు నిధులు ఖర్చుపెట్టేందుకు మంత్రి వర్గం ఆమోదించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని డిసిసిబి హాల్‌లో ఏర్పాటుచేసిన ప్రధానోపాధ్యాయుల సమావేశం , ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తు పదవీ విరమణ చేసిన ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రసంగిస్తూ ఉపాధ్యాయులు ఎవరికైనా ఎటువంటి సమస్య ఏర్పడినా ఎస్‌ఎంఎస్ పంపితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఉపాధ్యాయులంతా అంకితభావంతో పనిచేసి తమశాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలపట్ల ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలవుతున్నందున విధిగా ఉపాధ్యాయులంతా పాఠశాలకు వెళ్లడం తప్పదని, ప్రతి ఉపాధ్యాయుడు పిల్లలపై వత్తిడి తీసుకురాకుండా విద్యాబోధన చేస్తూ పరీక్ష ఫలితాలు మెరుగుపరచాలని కోరారు. వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకాడదన్నారు. పాఠశాల మైదానంలో, పరిసర ప్రాంతాలను స్వచ్ఛ విద్యాలయాలుగా తీర్చిదిద్దాలన్నారు. మధ్యాహ్నం భోజన పథకాలను ఇస్కాన్ వారు సరఫరా చేసే ఆహార పదార్థాలు చెడిపోతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయని, ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌చే తనిఖీ చేయించాలని డిఇఓ శైలజను కోరారు. అనంతరం ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కొన్ని పాఠశాలల్లో హెడ్మాస్టర్ బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారని, మిగిలిన పాఠశాలల్లో ఈనెలాఖరు నుంచి అమలులోకి వస్తుందన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాఠశాలల ఆవరణలో, మైదానాలను శుభ్రపరచడం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ప్రధానోపాద్యాయులందరినీ సన్మానించారు. కార్యక్రమంలో డిఇఓ శైలత, డిప్యుటీ డిఇఓలు జిలానీబాషా, హేమలత, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామసుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల కోసం టైలరింగ్ శిక్షణ కేంద్రాలు

కడప,అక్టోబర్ 20: జిల్లాకేంద్రంలో ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నందున ముస్లిం యువతులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు 4 శిక్షణ కేంద్రాలను అల్మాస్‌పేట, చిలకలబావి, గౌస్‌నగర్, రవీంద్రనగర్‌లో ఏర్పాటుచేసి మూడు మాసాలు శిక్షణ ఇచ్చి 400 మంది ముస్లిం యువతులకు రూ.46లక్షలతో కుట్టుమిషన్లు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కుట్టుమిషన్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. పలువురు ముస్లిం యువతులతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ హిదాయత్, ఎమ్మెల్సీ షరీఫ్‌లు వారి స్థితిగతులు తెలుసుకుని మరికొన్ని సంక్షేమ పథకాలకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందర్నీ బాగా చదివించాలని అందరికీ విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్, ఉర్దూ అకాడమి చైర్మన్ డా.నౌమాన్ , మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు హిర్మాణీ, అన్సర్ హుస్సేన్, మహబూబ్‌బాషా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్దన్‌రెడ్డి, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్.హరిప్రసాద్, రాష్టమ్రైనార్టీసెల్ మాజీ అధ్యక్షుడు అమీర్‌బాషా, సుభాన్‌బాషా, నగర అధ్యక్షుడు జిలానీబాషా, దుర్గాప్రసాద్, మైనార్టీ కార్పొరేషన్ ఇడి జమాల్ అహ్మద్, డిఎండబ్ల్యుఓ ఖాదర్‌బాషా, నగర పాలక కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి పాల్గొన్నారు.