కడప

ఐకమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగుంట్ల, అక్టోబర్ 20: ఐకమ త్యం తోనే బీసీలకు రాజ్యాధికారం దక్కు తుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం ఆర్‌టిపిపిలో జ్యోతిరావుపూలే విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. జెన్‌కో అధ్యక్షులు రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీసీ సంఘాలను ఏర్పాటుచేయడం ద్వారా సంఘాలతోపాటు కులాలకు గుర్తింపు తీసుకు రావాలన్నారు. ప్రతి బీసీకులాల పేరిట కాకుండా వెనుకబడిన అన్ని కులాలను కలుపుకుని ముందుకు పోయినపుడే వెనుకబడిన కులాలకు గుర్తింపు వస్తుందన్నారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 25 శాతమే రిజర్వేషన్లు ఉండడమే అగ్రవర్ణాల పెత్తనంకు నిదర్శనమన్నారు. కేంద్రంలో 14 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో 2 లక్షల బీసీ ఉద్యోగాలు ఉన్నాయని, వీటిని వెంటనే వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ల ద్వారా కల్పించాలన్నారు. అధికారం ఉంటే గుర్తింపు వస్తుందని, అదే అధికారంతో వెనుకబడిన కులాలను ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. భావ దాస్యాన్ని త్యజించి, బానిస ఆచారాలను నిర్మూలించాలన్నారు. సంకల్ఫం బలంగా ఉంటే అధికారం వెనుకబడిన కులాలచేతికి వస్తుందని ఆయన జోస్యం పలికారు. అంతకు ముందు ఆర్టీపీపీ సిఇ శ్రీరాములు మాట్లాడుతూ పూలే మానవజాతి మనుగడకు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, నామినేటెడ్ సభ్యులుగా గవర్నర్ బీసీలను నియమించాలన్నారు. అంతకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీని కలవగా స్పందించి జాతీయ కమిషన్‌కు గుర్తింపు తెచ్చారన్నారు. ఈ సమావేశంలో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులతో పాటు వివిధ సంఘాల నాయకులు వీరభద్రయ్య, గంగాధర్, ఎంపీటీసీ నాగమణి, డాక్టర్ లక్ష్మీనరసయ్య, రామలింగం, బాలయ్యయాదవ్, లక్ష్మీనరసింహులు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వాహనాల దారి మళ్లింపు..
జమ్మలమడుగు/ కొండాపురం, అక్టోబర్ 20: కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో అడ్డంకుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలను అధికారులు దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. కడప నుండి తాడిపత్రికి వరకు ఉన్న ప్రధాన రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూంటాయి. సాధారణంగా కడప నుండి బయలుదేరే వాహనాలు కమలాపురం, ముద్దనూరు, కొండాపురం మీదుగా ప్రధాన రహదారి ద్వారా వెళ్తుంటాయి. అయితే కొండాపురం సమీపంలో గంగాపురం సమీపంలో ఉన్న కల్వర్టు దెబ్బతినింది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు చిత్రావతి నది ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు కడప నుండి వచ్చే వాహనాలను రెండు మార్గాల ద్వారా తాడిపత్రికి చేరుకునేలా ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లింపు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముద్దనూరు వద్ద నుండి అటు మల్లేల, లావనూరు, యల్లనూరు మీదుగా తాడిపత్రికి చేరుకునేలా వాహనాలను పంపుతున్నారు. అలాగే ముద్దనూరు నుండి మరో మార్గంగా జమ్మలమడుగు మీదుగా తాడిపత్రికి వాహనాలను దారిమళ్లించారు. గండికోట జలాశయంలో 12టియంసిల మేర నీటి నిల్వ చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరే వరద నీటితో పాటు, శ్రీశైలం జలాశయం నుండి అవుకు రిజర్వాయర్ ద్వారా గండికోటకు 1200 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేపట్టిన విషయం విధితమే. గండికోట జలాశయంలో నీటి నిల్వ వల్ల రహదారి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా చేపట్టిన రోడ్డు పనులు జరుగుతున్నాయి. గండికోట జలాశయంలో నీటి నిల్వ చర్యల వల్ల ప్రస్తుత రహదారి మార్గాలు ప్రయాణానికి కష్టతరమవనున్నాయి. తాడిపత్రి వైపు వెళ్లే వాహనాలకు రహదారి ఇబ్బందులు లేకుండా చూసేందుకు చేపట్టిన ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.