కడప

టిడిపి హయాంలోనే మైనార్టీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 20: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి చెందారని మైనార్టీ ఫైనాన్స్‌కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ హిదాయత్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో రాష్టమ్రైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ముస్లిం మైనార్టీల్లో చాలా మంది పేదలున్నారని వారికి నెలకు రూ.10వేలు సంపాదించేందుకు ముఖ్యమంత్రి నైపుణ్యం కోర్సులు ప్రవేశపెట్టారని మైనార్టీ విద్యార్థులకు విద్యను ప్రోత్సహించేందుకు రూ.250కోట్లు ఉపకార వేతనాలు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రతి మైనార్టీ యువతీ యువకులు విద్యాభ్యాసం చేసి తమ కాళ్లమీద నిలబడాలని ఆయన కోరారు. మైనార్టీలకు రుణాలు నిమిత్తం 50శాతం సబ్సిడీ రుణాలు ఇస్తున్నారని, అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూ.10లక్షు ఆర్థికసాయం అందిస్తున్నారన్నారు. దుల్హన్ పథకం కింద పేదముస్లింలకు వివాహాలు నిమిత్తం రూ.50 ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్, వౌజన్లకు గౌరవవేతనం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటివిడతగా 216 మసీదులు, ఇమామ్, వౌజన్లకు గౌరవేతనాలు కలిపి రూ.3,11,4000 ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మరో 201 మసీదులకు అనుమతులు లభిస్తున్నాయన్నారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన హజ్‌కు వెళ్లేందుకు కడప లో హజ్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ షరీఫ్ ప్రసంగిస్తూ ముస్లిం యువతీ యువకులకు వివిధ వృత్తులు చేసుకునేవారికి జీవనోపాధులు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థచే కావాల్సినరుణాలు ఇస్తూ శిక్షణ ఇస్తున్నామన్నారు. మైనార్టీలపట్ల ముఖ్యమంత్రి ఆదరణాభిమానాలు కారణంగానే గతంలో ఏ ప్రభుత్వం అమలుచేయని విధంగా అనేక సంక్షేమపథకాలు మైనార్టీకి నేరుగా చేరుతున్నాయన్నారు. ప్రస్తుతం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రైలరింగ్ శిక్షణ పొందిన మైనార్టీ మహిళలకు 400 కుట్టుమిషన్లు పంపిణీ చేశామన్నారు. సమాజంలో ముస్లిం మహిళలు గౌరవంగా జీవించేందుకు భర్తతోపాటు సతీమణి సంపాదించే నిమిత్తం మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ ప్రసంగిస్తూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్‌యాత్ర నిమిత్తం ముఖ్యంగా చంద్రబాబునాయుడు విజయవాడ, కడపలలో హజ్‌హౌస్ నిర్మించడం మైనార్టీలకు వరంలాంటిదన్నారు. ఉర్దూ అకాడమి చైర్మన్ డా.నవ్‌మాన్ ప్రసంగిస్తూ ఉర్దూబాష అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందన్నారు. అలాగే టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి (వాసు) మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఈ తరహాలో మైనార్టీలకు చేయూతనివ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో మైనార్టీ ఓట్లను దండుకునేందుకే నేతలు వస్తున్నారని టిడిపి హయాంలో అమలు జరిగిన పథకాలు ఏ ప్రభుత్వంలో అమలుకాలేదన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్లు అన్సర్ హేస్సేని, మహబూబ్‌బాషా, పార్టీ జిల్లా కార్యదర్శి బి.హరిప్రసాద్, రాష్ట్ర, జిల్లా నేతలు ఎస్.గోవర్దన్‌రెడ్డి, విఎస్ అమీర్‌బాబు, సుభాన్‌బాషా, జిలానీబాషా, దుర్గాప్రసాద్‌లు పాల్గొన్నారు.