కడప

ఉక్కు ఉద్యమంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 13:కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 250వరోజుకు చేరాయి. దీంతో ఉద్యమకారులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తూ ఏకంగా కడప ఆకాశవాణి కేంద్రం ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ఎండగడుతూ ప్రధానిమోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ, వైఎస్సార్‌ప్రజాపార్టీ, కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో కడపలోని ఆకాశవాణి కేంద్రం ఎదుట బైఠాయించారు. ఉద్యమకారులు కేవలం తమ నిరసన వ్యక్తం చేసేందుకు బైఠాయించగా పోలీసులు అత్యుంత ఉత్సాహం చూపించారు. ప్రభుత్వ ఆస్తులకు కానీ, ప్రజలకు ఇబ్బందులు కానీ కలిగించకుండా ప్రశాంతంగా ఆందోళన నిర్వహిస్తున్న నేపధ్యంలో ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ పెద్ద ఎత్తున పోలీసులు ఆందోళన కారులను బలవంతంగా ఈడ్చుకు వెళ్లి వ్యాన్‌లో పడేశారు. అరెస్టుల పర్వం దృశ్యాన్ని చూస్తున్న వ్యక్తులను సైతం రండి మిమ్ములను వ్యాన్ ఎక్కిస్తామంటూ ఓ ట్రాఫిక్ ఎస్సై అవహేళనగా మాట్లాడటం చూస్తే పోలీసులు ఉక్కు ఉద్యమాన్ని కాదు ప్రభుత్వాలకు ఏమాత్రం వ్యతిరేకంగా వ్యవహరించినా తాట తీస్తామనే రీతిలో వ్యవహరించడం గమనార్హం. గంటపాటు ఆకాశవాణి కేంద్రం వద్ద ఆందోళనకారులకు, పోలీసులకు మద్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం, పరస్పరం తోపులాటలు కొనసాగాయి. ముందుగా మురళి థియేటర్ సర్కిల్‌లోని ఆందోళన శిబిరంలో పాల్గొన్న రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ రాష్టక్రార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడు నెలలుగా ఉద్యమం జిల్లాలో కొనసాగుతోందని , కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుచేస్తామని రాయలసీమ విభజన సమయంలో కేంద్రంలో ఉన్న అప్పటిపాలకులతోపాటు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి సైతం ప్రకటించిందని అయితే ఇప్పటి వరకు నాలుగేళ్లు గడుస్తున్నా ఉక్కుపరిశ్రమపై ఎలాంటి ఆదేశాలు కానీ, అనుమతులు కానీ రాలేదన్నారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఇందుకు ఈరెండుప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ ప్రజాపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎ.మహేష్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు. కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్దివుంటే తక్షణమే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు జక్కరయ్య మాట్లాడుతూ కడపలో ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం మోకాళు అడ్డిందని ధ్వజమెత్తారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిర్లక్ష్యధోరణిగా వ్యవహరించినట్లు ఆరోపించారు.
ర్యాలీ అరెస్టు
కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకారులు ముందుగా మురళీథియేటర్ సమీపంలోని దీక్షాశిబిరం వద్ద నుండి ప్రదర్శనగా కడప ఆకాశవాణి కేంద్రం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇక్కడ ధర్నా నిర్వహించి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మద్య వాగ్వివాదం పరస్పర తోపులాటలు జరిగాయి. పోలీసుల అరెస్టులు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆందోళనకారులు గట్టిగా నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు బలవంతంగా అరెస్టులు సాగించారు. ఈ అరెస్టుల్లో రాష్టక్రార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, పార్టీ నేతలు సిద్దిరామయ్య, శంకర్, ఫర్హత్, చెన్నయ్య, తస్లీమ్, కార్తిక్, భరత్, అరవింద్, రవి, నాగరాజు, బేగం, లక్ష్మిదేవి, నరసింహతోపాటు సుమారు 20మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి వారిని చింతకొమ్మదినె్న, రిమ్స్, చిన్నచౌకు పోలీసుస్టేషన్లకు తరలించారు.

రాష్టబ్రడ్జెట్‌లో నారుూ బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం
కడప కల్చరల్,మార్చి 13: రాష్డ్రబడ్జెట్‌లో నారుూబ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందని నారుూబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర చైర్మన్ వండాడి వెంకటేష్ ఆరోపించారు. మంగళవారం స్థానిక నారుూబ్రాహ్మణసేవా సంఘం కార్యాలయంలో జిల్లాస్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌లో నారుూబ్రాహ్మణులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్టవ్య్రాప్తంగా 5లక్షల మంది నారుూబ్రాహ్మణులు ఉన్నారని, వారికి రూ.35కోట్ల నిధులు కేటాయిస్తే ఏమేరకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా నారుూబ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదని కనీసం శ్రద్దకూడా చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా నారుూబ్రాహ్మణులు ఎంతో వెనుకబడివున్నారన్నారు. నారుూబ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నాయని, దేవాలయంలో ఉన్న పోస్టుల భర్తీవిషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించాల్సివుంటుందని వండాడి హెచ్చరించారు.