కడప

నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,మార్చి 13: పంచాయతీలో నీటి ఎద్దడి కొరవడింది. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఆ దిశగా క్షేత్రస్థాయిలో నీటి ఎద్దడి నివారణకు పరిష్కార మార్గాలు చూపకపోవడంతో వేసవికాలంలో ప్రతి ఏడాది నీటి కొరత ఏర్పడుతోంది. అయితే పల్లెల్లో గొంతు తడారిపోకుండా ఉండేందుకే జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా రాష్ట్రప్రభుత్వానికి తక్షణమే రూ.1800కోట్లు నిధులు కావాలని ప్రణాళికలు రూపొందించి, ప్రభుత్వానికి పంపింది. జిల్లాలో గత ఏడాదికన్నా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదుకావడంతో భూగర్భజలాల నీటిమట్టం అడుగంటాయి. దీంతో పల్లెప్రజలు వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు సంభవిస్తున్నాయి. జిల్లాలో ముఖ్యంగా టి.సుండుపల్లె, చిట్వేలి, రాజంపేట, నందలూరు, రామాపురం, సంబేపల్లి, వీరబల్లి, చిన్నమండెం , చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె, వేముల, తొండూరు,లింగాల , సింహాద్రిపురం, వల్లూరు, వేంపల్లె, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జిల్లాలో ఉన్న నీటి వనరులు బహుదానది, కుందూనది, అన్నమయ్య, వెలిగల్లు, మైలవరం, ఎస్‌ఆర్ -1, ఎస్‌ఆర్-2, గండికోట, బ్రహ్మంసాగర్ వనరులు ఇప్పటికే వట్టిపోయాయి. ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీటి కొళాయికనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. అయితే ఆ దిశగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఆశించిన అభివృద్ధి జరగలేదు. గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ నిద్రావస్థలో జోగుతోంది. ప్రతిపాదనలు సిద్ధం చేసినంత వేగంగా ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చకపోవడంతో ఆశాఖ సతమతవౌతోంది. 23 పథకాలు తాగునీటి ఎద్దడి నివారణ కింద చేపట్టేందుకు జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా వల్లూరు మండలంలో 69గ్రామాలు, చెన్నూరు మండలంలో 31 గ్రామాల్లో 63,094 మందికి పినాకిణి నీటిని ఇవ్వడానికి రూ.160కోట్లు ఖర్చుఅవుతుందని ఆశాఖ లెక్కకట్టింది. కొండాపురం మండలంలో 49గ్రామాలు , ముద్దనూరు మండలంలో 39గ్రామాలకు గాను 43,894మంది ప్రజలకు గండికోట జలాశయం నుండి 0.10టిఎంసిలు నీటిని తోడి రక్షిత జలాలు అందించేందుకు రూ.37కోట్లకు ప్రతిపాదనలు తయారుచేసింది. వీరపునాయునిపల్లె, కమలాపురం, ఎర్రగుంట్లలోని 122నివాసప్రాంతాల్లో లక్షా 24వేల 071మంది ప్రజలకు తాగునీటి వసతి కల్పించేందుకు పెన్నా, కుందూ నదుల సంగమం నుంచి 0.15 శతకోటి ఘణపుటడుగుల నీరు సేకరించాల్సివుంది. ఇందుకోసం రూ.100కోట్లు వ్యయం అవుతుంది. రైల్వేకోడూరు, చిట్వేలి మండలాల్లోని 326 ప్రాంతాల్లో నివాసం ఉంటున్న లక్షా 54వేల 232 మంది జనాభాకు నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి 0.20 టిఎంసీలు తాగునీటి వసతి చేపట్టేందుకు రూ.115కోట్లు అవసరం, నీటి పొదుపు, వాతావరణ సంరక్షణ, మొక్కల పెంపకం వంటి వాటికి ప్రజలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తాగునీటి ఇక్కట్లు సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు సంబంధించిన నిధులు త్వరితగతిన మంజూరైతేకానీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేసేందుకు సులభతరవౌతుంది.

రేపటి నుంచే టెన్త్ పరీక్షలు
* 35,737 మంది విద్యార్థులు హాజరు * 164 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ :డిఇవో శైలజ
కడప అర్బన్,మార్చి 13: టెన్త్‌పరీక్షలు ఈనెల 15వ తేది నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 35,737 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు రాసేందుకు 164కేంద్రాలను జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రైవేట్ విద్యాసంస్థలు పాతబకాయిల పేరిట విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి విద్యార్థి బళ్లపై కూర్చుని పరీక్షలు రాసేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ సోమవారం జిల్లా విద్యాశాఖాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందే చేరుకోవాలని డిఇవో తెలిపారు. అలాగే దూరప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు ఆమె వెల్లడించారు. కండక్టర్‌కు హాల్‌టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద తాగునీటి కొరత లేకుండా చేశామని చెప్పారు. పబ్లిక్ పరీక్షల క్రతువులో 2వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించనున్నారని, వీరిలో ఉన్నతపాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని కాకుండా మిగతా వారిని ఇన్విజిలేటర్లుగా, కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అభ్యర్థులు ప్రశ్నలను అర్థం చేసుకుని సమాధానాన్ని సక్రమంగా రాయాలన్నారు.