కడప

ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే:జేఏసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 13: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కేంద్రం ప్రకటించి తీరాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శివారెడ్డి డిమాండ్ చేశారు. రాష్టక్రమిటీ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలో పలుశాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడురోడ్ల కూడలిలో ఏర్పాటుచేసిన మానవహారం ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఉండటం మన రాష్ట్రానికి తీరని అన్యాయమని ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంపట్ల నిర్లక్ష్యం చేయడం వల్ల కేవలం ప్రభుత్వానికే కాకుండా ఉద్యోగులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ నుండి షెడ్యూల్ 4,9,10 జివోల ప్రకారం ఆస్తుల పంపిణీ చేయాల్సివుందని దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏపిలోని పలుశాఖలు ఆర్థికభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే గాకుండా జేఏసి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు పలుమార్లు కేంద్రానికి నివేదించినప్పటికీ ఫలితం లేకుండాపోయిందన్నారు. ఇందువల్ల రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా తీసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర ఉద్యోగులతోపాటు కేంద్రంలోని 50లక్షల మంది ఉద్యోగులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమించక తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతరం జేఏసీ కన్వీనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. అంతకుమునుపు జిల్లా పరిషత్ నుండి కోటిరెడ్డి సర్కిల్, ఎన్‌టిఆర్ సర్కిల్, ఏడురోడ్లకూడలి వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జేఏసీ నేతలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.