కడప

ఏకశిలా రామయ్య ఉత్సవాలకు సిద్ధమాయేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 19:ప్రపంచంలోనే రామాలయాలలో ఒక్కటిగా గుర్తింపునొందిన ఒంటిమిట్ట రాములోరు బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యారు. టీటీడీ ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరాయి. ఫలితంగా రాములోరు బ్రహ్మోత్సవ శోభకు ముస్తాబవుతున్నారు. ఈ నేపథ్యంలో మాడవీధుల దగ్గర నుంచి స్వామి విహరించే గ్రామ పురవీధుల వరకు భారీ స్థాయి కటౌట్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో వివిధ దేవతామూర్తుల ఆకారాలతో కూడిన లైటింగ్ కూడా సిద్ధంచేశారు. అదేవిధంగా గత రెండు రోజులుగా లైటింగ్‌కు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. దక్షణభాగం, కల్యాణ వేదిక ప్రాంతంలో భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్ల వసతి కల్పించేందుకు ఏర్పాటు చేశారు. టీటీడీ ముమ్మరం చేసిన ఈ పనులు దాదాపుగా చివరిదశకు చేరాయి. మరో నాలుగు రోజుల్లో బ్రహ్మోత్సవ శోభ ఏకశిలానగరంలో మిన్నంటనుంది. ఆలయ ప్రాంగణం, మాడ వీధులు, కల్యాణవేదిక, భక్తుల అదనపు గదుల సముదాయ ప్రదేశాలలో భారీ స్థాయిలో లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఏకశిలానగరం రామయ్య బ్రహ్మోత్సవ ఘడియలకు సీతమ్మతల్లి, లక్ష్ముణ స్వామిలతో సిద్ధం కాబోతున్నారు.
నేడు రాములోరికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
బ్రహ్మోత్సవాల శోభను పురస్కరించుకుని మూడు రోజులు ముందు నిర్వహించే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమానికి మంగళవారం అంకుర్పారణ చేయనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి 5-30 వరకు సుప్రభాతం, 5-30 నుండి 6 వరకు ఆలయ శుద్ధి, ఆరాధన, ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు సర్వదర్శనం, 7-30కు ఆలయ శుద్ధి, 8 నుండి 11-30 వరకు కోయిల్ అళ్వార్ తిరుమంజనం, 11-30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం, 6-30 నుండి 8 వరకు సర్వదర్శనం, రాత్రి 8 నుండి 8-10 వరకు ఏకాంత సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు డిప్యూటి ఇఓ లక్ష్మీనాయక్ తెలిపారు. ఇందులో భాగంగా కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించే సమయంలో ఉదయం 8 నుండి 11-30 వరకు స్వామి దర్శనం ఉండదని, భక్తులు ఈ విషయం గమనించాలన్నారు.