కడప

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు చేసిన అధికారులకు ప్రశంసాపత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,మార్చి 19: ఈనెల 9వ తేదిన రాజస్తాన్‌లోని జయపూర్ నగరంలో మోస్ట్‌వాంటెడ్‌గా పేరుపొందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అశోక్‌కుమార్ అగర్వాల్‌ను అరెస్టు చేయడంలో కడప ఆపరేషన్ ఎస్పీ అద్నా నరుూ హాస్మీని రాయలసీమ ఐజి మహ్మద్ ఇక్బాల్ అభినందించారు. సోమవారం జిల్లాపోలీసు కార్యాలయంలో ఎర్రచందనం స్మగ్లర్‌ను పట్టుకోవడంలో ప్రణాళిక రచించి సఫలీకృతులైన జిల్లాస్థాయి, దిగువస్థాయి అధికారులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ జయపూర్ ఆపరేషన్ గురించి ఇటీవల కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసిన మోస్ట్‌వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్‌ను స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాలు ఇతరత్రా వస్తువులు వివరాలు ఆపరేషన్ ఎస్పీ అద్నాన్ ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమరవాణా బృందం సభ్యులు జాతీయ, అంతర్జాతీయ వాటిపై నిఘావుంచారన్నారు. స్మగ్లర్లను అరెస్టుచేయడంలో పోలీసు అధికారుల చొరవ అభినందనీయమన్నారు. మావోయిస్టులు, టెర్రరిస్టులు, ఆపరేషన్‌లో చందనం స్మగ్లర్లను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు చూపిన ఎస్‌ఐ హేమకుమార్‌ను, ఎస్పీని, ఐజి ప్రత్యేకంగా అభినందించారు. ఐజి నుంచి ప్రశంసాపత్రాలు పొందిన వారిలో ఏఎస్పీ అద్నాన్, ఫ్యాక్షన్‌జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, మైదుకూరు అర్బన్ సీఐ వై.వెంకటేశ్వర్లు, సికెదినె్న ఎస్‌ఐ హేమకుమార్, సంబేపల్లి ఎస్‌ఐ ఎస్.హసమ్, సైబర్‌సెల్ ఎస్‌ఐ ఆర్.వెంకటకొండారెడ్డి, కానిస్టేబుళ్లు ఎస్.శివరామనాయుడు, జి.వెంకటరమణ, సి.కొండయ్య, బి.గోపీనాయక్, ఎం.విద్యాసాగర్, ఎం.రఫీ పఠాన్‌లను ఐజి ప్రసంశాపత్రాలతో సన్మానించారు.

ప్రత్యేక హోదా పోరాటయోధుడు జగన్
* మునిసిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్
రాయచోటి, మార్చి 19: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్ అని మునిసిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్ అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాసంకల్ప మానవహారం సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని సాధించుకునే వరకు అందరం చేయి చేయి కలిపి పోరాటాలు చేద్దామన్నారు. ఆంధ్రుల సత్తా ఏంటో చూపిద్దామన్నారు. ప్రత్యేక హోదా పోరాటయోధుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని ఆమె ఘాటుగా విమర్శించారు. కాగా సోమవారం ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాటం చేస్తున్న వైసీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా సోమవారం నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ, ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించారు. ప్రత్యేక హోదా నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. బస్టాండు సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేకహోదా కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.