కడప

మిత్రపక్షంగా ఉంటూ చుక్కలు చూపించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,మార్చి 19: తమకు మిత్రపక్షంగానే ఉంటూనే నమ్మితే చుక్కలు చూపించారని సోమవారం మార్కెటింగ్‌శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. నగరంలోని ఆర్ అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీజేపీ ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉంటూ చందమామ కథలు చెప్పారన్నారు. కాంగ్రెస్ ముక్కలు చేస్తే వీరు చుక్కలు చూపించారన్నారు. ఇప్పటికే బీజేపీ ఏపీలో ప్రజాభిమానం కోల్పోయిందన్నారు. డిమానిటైజేషన్, జిఎస్‌టి రూ.లక్షకంటే ఎక్కువ ఉండి వడ్డీలు వస్తుంటే వాటిపై పన్ను, డిపాజిటర్ల సొమ్ము అనుమతిలేకుండా ఉపయోగించుకోవడం, రైతు ఉత్పత్తుల ధరలు పడిపోవడం లాంటి పలు సమస్యలతో దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. తెలుగుదేశంపార్టీ ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని వాయిదా వేశారని ఎన్నిసార్లు వాయిదా వేసినా ఒకసారి సభ ముందుకు రాకతప్పదన్నారు. అప్పుడైనా సరే బిజెపి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం అన్ని పార్టీలకు తెలిసిపోతుందన్నారు. జగన్మోహన్‌రెడ్డి అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టేందుకు 40రోజులు సమయం తీసుకున్నారని, అదే చంద్రబాబుకు కేవలం ఒక్కరోజులోనే దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. రాష్ట్ర జిడిపి 11.2కు ఉందని, మీకు నిధులెందుకని జైట్లీ ప్రశ్నిస్తున్నారని, కేంద్రం ఇచ్చే ఈనిధులు కేవలం గ్రేస్‌మార్కులు లాంటివే అన్నారు. కడప జిల్లాలో గాలేరు-నగరి, గండికోట, హంద్రీనీవా, బ్రహ్మంగారి కెనాల్ లాంటివి ఎన్నో పూర్తికావాల్సివున్నాయని, అంతేగాక కడపకు రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ సైతం ఇక్కడే వస్తుందని, ఇందుకోసం చేసిన నివేదికలు కూడా ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే విషయాన్ని నూరుశాతం ధృవీకరిస్తున్నాయన్నారు. జిల్లాలో టెన్ ప్లస్ టు గెలిచేందుకు అభివృద్ధినే మంత్రంగా ఉపయోగిస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ విషయంలో రాజకీయాలంటే సినిమా కాదన్నారు. సినిమా అయితే మూడు ఫైట్లు, ఆరు డ్యూయెట్లుగా ఉంటుందని రాజకీయాలు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కాదన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేయాల్సి వుంటుందన్నారు. ప్రత్యేకహోదాను కాపాడాల్సిన అవసరం అందరికీ ఉండదన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నందుకు ముస్లింలు కూడా ఆనందపడుతున్నారన్నారు. రెండురోజుల క్రితం జిల్లాలో పడ్డ 10సెం.మీ వర్షం రైతులను ఎంతో దెబ్బతీసిందని, నష్టపోయిన అంశాలను నివేదికగా ఇవ్వాలని అధికారులను కోరుతున్నామన్నారు.