క్రైమ్/లీగల్

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప క్రైం,మార్చి 20: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధాలున్న ఇద్దరు స్మగ్లర్లపై జిల్లా ఎస్పీ పీడీ చట్టం ప్రయోగించారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అహ్మద్ తంబీ మైదీన్, అంతర్ రాష్ట్రీయ ఎర్రచందనం స్మగ్లర్ సిగరపాటి శ్రీనివాసులుపై ఎస్పీ అట్టాడ బాబూజీ మంగళవారం పీడీ చట్టం ప్రయోగించారు. అహ్మద్ తంబి మైద్దీన్ వయస్సు 50సంవత్సరాలు, ఇతను తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని నాగూర్‌కు చెందిన వాడు. ప్రస్తుతం చెన్నైలోని ఎగ్మోర్‌లో నివశిస్తున్నాడు. 10వ తరగతి చదివిన అహ్మద్ 1987లో అండమాన్ దీవులకు వెళ్లి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో టీ సప్లయర్‌గా పనిచేసేవాడు. హోటళ్లలో పనిచేసే కాలంలోనే సింగపూర్ నుండి వ్యాపార రీత్యా ఆ హోటల్‌క వచ్చి బసచేసే ఒక భార్య భర్త జంటతో ఇతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ సింగపూర్ వ్యాపార జంటతో సముద్రపు చిప్పలను విదేశాలకు ఎగుమతి చేసే పనిలో అనుభవం సంపాదించాడు. 1990లో అండమాన్ నుండి చెన్నైకి తిరిగివచ్చి మైదీన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పేరిట వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభంలో సముద్రపు ఆహార ఉత్పత్తులను, సముద్రపు చిప్పలు ,కూరగాయలు ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని ఆర్జించేవాడు. ఈ రకంగా కస్టమ్స్ హౌస్ ఏజెంట్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. విదేశాలకు వస్తువులను ఎగుమతి చేయడంలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. ఈకాలంలోనే మయన్మార్ నుండి చెన్నై రెడ్ హిల్స్‌కు వచ్చి స్థిరపడిన ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఎగుమతులు దిగుమతులలో అనుభవం సంపాదించిన అహ్మద్ మైదీన్‌ను ఆ ఎర్రస్మగ్లర్లు సహకారం కోరారు. ఎర్రచందనాన్ని చైనా, దుబాయ్, మలేషియా, సింగపూర్ , హాంకాంగ్ తదితర దేశాలకు చెన్నై నుండి ఎగుమతి చేయడంలో సహకరించాలని కోరారు. ఎగుమతుల వ్యాపారంలో పరిజ్ఞానం ఉన్న మైదీన్ ఆ తర్వాత ఎర్రచందనం ఎగుమతి దారుడిగా మారిపోయాడు. ఆ వ్యాపారంలో అంతర్జాతీయ స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. క్రమేణ అహ్మద్ మైదీన్ కీలకంగా మారాడు. ఎర్రచందనం దుంగలు ఎగుమతి చేస్తూ వందలకోట్లరూపాయలు సంపాదించారు. కడప జిల్లాలోని కొల్లం గంగిరెడ్డి, దర్బార్‌బాషా, తిరుపతికి చెందిన వెంకటరెడ్డిలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. తన ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ద్వారా 3వేల టన్నులకు పైగా ఎర్రచందనాన్ని తరలించినట్లు విచారణలో అహ్మద్ అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఇక 2వ వాడైన సిగరపాటి శ్రీనివాసులుకు 26 ఏళ్ల వయస్సు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందినవాడు. రెండేళ్లనుండి ఇతను ఎర్రచందనం అక్రమరవాణా కార్యకలాపాల్లో భాగం పంచుకుంటున్నారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జంగాల శివశంకర్‌కు ఇతను ముఖ్య అనుచురుడు. కడప ,చిత్తూరు జిల్లాల్లోని అటవీప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లను నరికించి, దుంగలుగా మార్చి వాహనాలకు ఎక్కించి, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు రవాణా చేసే కార్యక్రమాల్లో పర్యవేక్షించేవాడు. ఇతనిపై కడప జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. వీరిద్దరిపై మంగళవారం పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.