కడప

క్రీడలకు నిలయంగా రాజంపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, డిసెంబర్ 28: ప్రతి సంవత్సరం రాజంపేట పట్టణంలో జిల్లాస్థాయి, రాష్టస్థ్రాయి క్రీడాపోటీలు నిర్వహిస్తూ క్రీడలకు నిలయంగా రాజంపేట పట్టణాన్ని అభివృద్ధిచేయడం జరిగిందని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో 61వ రాష్టస్థ్రాయి వాలీబాల్ క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, అన్ని రంగాలలో రాణించినపుడే వారికి మంచి గుర్తింపుతో పాటు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని క్రీడా పోటీలలో రాణించాలన్నారు. నిరంతరం శ్రమ సాధన ఉంటే మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగ వచ్చునన్నారు. ఆటల పోటీలలో గెలుపు, ఓటమిలు ఉంటాయన్నారు. క్రీడాకారులు వాటిని స్నేహభావంతో తీసుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలన్నారు. ప్రతి విద్యార్థి వ్యాయామ ఉపాధ్యాయుల సలహలు, సూచనలు పాటించి తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా క్రీడలలో కూడా రాణించినట్లైతే అన్ని రంగాలలో ప్రతిభను చాటేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలోని వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో ప్రతి ఏడాది రాజంపేట పట్టణంలో క్రీడాపోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్‌లో గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ క్రీడాపోటీల ప్రారంభానికి ముందు మూడు శాంతి కపోతాలను వారు గాలిలోకి ఎగుర వేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై, సిఐ రియాజ్ అహ్మద్, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎజిపి టి.లక్ష్మీనారాయణ, డాక్టర్ సి.సుధాకర్, ఆర్‌ఐపిఇ భానుమూర్తిరాజు, కమీషనర్ ఫజులుల్లా, టిడిపి నాయకులు షేక్ అబ్దుల్లా, బాపనయ్యనాయుడు, టి.సంజీవ్‌రావు, ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 14 కోల్డ్‌స్టోరేజ్ యూనిట్‌ల నిర్మాణం
రాజంపేట టౌన్, డిసెంబర్ 28:రాష్టవ్య్రాప్తంగా ఈ ఏడాది 14 కోల్డ్‌స్టోరేజీ యూనిట్లను నిర్మిస్తున్నట్లు ఇందులో 40 వేల టన్నుల పండ్ల ఉత్పత్తులను రైతులు నిల్వ ఉంచుకోవచ్చునని మార్కెటింగ్ కమిటీ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. సోమవారం రాజంపేట బోయనపల్లెలోని మార్కెట్‌యార్డ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌యార్డ్‌ల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు దళారుల బారిన పడి నష్టపోకుండా నేరుగా మార్కెట్‌యార్డ్‌లకు వచ్చి గిట్టుబాటు ధర పొందేలా అవకాశాలు కల్పించామన్నారు. రైతుబంధు పథకం ద్వారా సన్నకారు, చిన్నకారు రైతులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 80 రైతుబజార్‌లు ఉన్నాయని, ప్రతి రైతుబజార్ ప్రవేటు సంస్థలాగా జరిగేందుకు అక్కడ పరిశుభ్రమైన వాతావరణంతో పాటు అన్ని వసతులు కల్పించడం జరిగిందని ఆయన చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకొనేందుకు త్వరలో జిల్లాలో రెండు గౌడవున్‌లను నిర్మిస్తామన్నారు. రాజంపేట మార్కెట్‌యార్డ్‌ను మదనపల్లె ప్రూట్ మార్కెట్ తరహలో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 280 మార్కెట్‌యార్డ్‌లు ఉన్నాయని, వాటికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించి, యార్డ్‌లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకొంటామన్నారు.
రాజంపేట మార్కెట్‌యార్డ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ జెడి సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ వెంకటసుబ్బన్న, రాజంపేట మార్కెట్ కమిటీ ఛేర్మన్ యెద్దల విజయసాగర్, డైరెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.