కడప

సీఎం నిరాహార దీక్షకు మద్దతు - నేడు జిల్లా వ్యాప్తంగా దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 19: ప్రత్యేక హోదాకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం విజయవాడలో చేపట్టనున్న ఒక్కరోజు నిరాహారదీక్షకు మద్దతుగా కడప జిల్లాను పెద్దఎత్తున నిరాహారదీక్షలు చేపట్టేందుకు తమ్ముళ్లు సిద్దమయ్యారు. ఆమేరకు గురువారమే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆయాప్రాంతాలకు తరలివచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ భారీఎత్తున నిరాహారదీక్షలు చేపట్టాలని పార్టీ ఆదేశించింది. ఫలితంగా ఈ నిరాహారదీక్షలు విజయవంతం చేసేందుకు నాయకులు దృష్టిపెట్టారు. ఇందుకోసం గురువారం రాత్రి నుండి ప్రతి ప్రాంతం నుండి జనసమీకరణ చేసేందుకు నాయకులను పురమాయించారు. ప్రధానంగా ఈ ప్రత్యేకహోదాపై ప్రతి గ్రామంలో ఇంటింటా తెలిసే విధంగా పార్టీ పెద్దఎత్తున ప్రచారం నిర్వహించేందుకు అధిష్టానం సూచనలు జారీ చేసింది. దీంతో తెలుగుదేశంపార్టీ రాష్టహ్రోదాకు చేపట్టిన ఉద్యమం భారీగా సాగుతోందని, ఊరువాడలా తెలిసేవిధంగా ఉండాలని పార్టీ పిలుపునివ్వడంతో నేతలు సన్నద్దమయ్యారు. మరొకవైపు తొమ్మిదినెలల పాటు నిత్యం ప్రజలతో మమేకమై ప్రభుత్వం తరపున చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించేవిధంగా ఇక అందుబాటులో నేతలు ఉండే విధంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పార్టీ పిలుపుమేరకు మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు, ఎమ్మెల్సీ,శాసనమండలి విప్‌లు పి.రామసుబ్బారెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పౌరసరఫరాల ఛైర్మన్ ఎం.లింగారెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్‌తోపాటు ఆయా నియోజకవర్గాల నేతలు కూడా జిల్లాకు తరలివచ్చారు. ఈ ఉద్యమం పెద్దఎత్తున ఉండాలని జిల్లా ఇన్‌చార్జిమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లా నేతల సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో అన్ని నియోజకవర్గాల నేతలు జనసమీకరణలో లీనమయ్యారు.

ఒకే వేదికమీదకు రెండు వర్గాలు చేరేనా?
ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని పార్టీ ఆదేశించింది. అయితే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న వైషమ్యాలవల్ల వీరంతా ఒకే వేదికమీదకు వస్తారా! లేక వేర్వేరుచోట్ల దీక్షలు చేపడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు, ప్రొద్దుటూరులో లింగారెడ్డి, వరదరాజులురెడ్డిలు, బద్వేలులో విజయమ్మ, ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతిలు, రాయచోటిలో పాలకొండ్రాయుడు, ఆర్.రమేష్‌రెడ్డి, రైల్వేకోడూరులో విశ్వనాథనాయుడు, బత్యాల చెంగల్రాయులు, కమలాపురంలో పుత్తానరసింహారెడ్డి, వీరశివారెడ్డిల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్లలో ఇప్పటి వరకు ఈరెండువర్గాలు ఏకమై ఒకే వేదికమీదకు వచ్చిన దాఖలాలు లేవు. అందరూ కలిసికట్టుగా ఉండాలని, పార్టీలో విబేధాలపర్వం ఉండేందుకు వీలులేదంటూ అనేక దఫాలుగా చంద్రబాబునాయుడు స్పష్టంచేసినప్పటికీ విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం జరగబోవు ప్రత్యేకహోదా దీక్షలు వర్గకుంపట్లుగా మారుతాయా లేక ఆయా నియోజకవర్గాల్లో నేతలంతా ఒకే వేదికమీదకు వస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.