కడప

సిద్దవటం కోట అభివృద్ధికి రూ.2కోట్లు అవసరం :కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, ఏప్రిల్ 19: సిద్దవటం కోట అభివృద్ధికి దాదాపు రూ.2కోట్లు ఖర్చుఅవుతుందని, పురావస్తుశాఖ అనుమతిస్తే తన సొంత నిధులు విడుదలచేసి అభివృద్ధిచేస్తామని కలెక్టర్ టి.బాబూరావునాయుడు అన్నారు. మండల కేంద్రమైన సిద్దవటం మట్లిరాజులకోటను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ కోటలోని మొదటి, రెండవ మంటపాలు, ఢంకానగర్, కామాక్షి ఆలయం, శివలింగం, బిస్మిల్లాషా ఖాద్రి దర్గా, మసీదు తదితర వాటిని సందర్శించి అనంతరం పెన్నానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశంలో సిద్దవటంకోట నిర్మించివుందన్నారు. తాను కోటను సందర్శించలేదని అందుకోసం ఎలా ఉందో పరిశీలించేందుకు వచ్చానన్నారు. భవిష్యత్‌లో టూరిస్టు సర్క్కూట్‌గా కడప పెద్దదర్గా, గండికోట, ఒంటిమిట్ట, దేవునికడప, సిద్దవటం కోట, సౌమ్యనాథ ఆలయంతోపాటు తదితర వాటిని చేర్చి అభివృద్ధి చేస్తామన్నారు. ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి జరిగిందన్నారు. కోటలో ఎంటర్‌టైన్‌మెంట్ తదితర వాటివి పురావస్తుశాఖ ఏర్పాటుచేయడం ద్వారా లైజర్ షో, డాక్యుమెంటరీ, కోట చరిత్రను ఏర్పాటుచేసినట్లయితే పర్యాటకులను ఆకర్షించవచ్చునన్నారు. ప్రభుత్వం కూడా పర్యాటకులకు సదుపాయాలు కల్పించే ఆలోచనలో ఉందని, అయితే పురావస్తుశాఖ అనుమతించినట్లయితే తన సొంత నిధులతో రూ.2కోట్లు ఖర్చుపెట్టి కోటను అభివృద్ధిచేస్తామన్నారు. తద్వారా నిరుద్యోగులకు భృతి కల్పించడంతోపాటు విద్యుత్‌కు నిధులు కూడా పర్యాటకుల ద్వారా వస్తుందన్నారు. కోటను పరిశుభ్రంగా ఉంచితే పర్యాటకులను ఆకర్షించవచ్చునన్నారు.

బాబు వికృత రాజకీయ క్రీడలో సమిధగా మారిన ఏపీ
* మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య
కడప సిటీ, ఏప్రిల్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వికృత రాజకీయ క్రీడలో ఆంధ్రప్రదేశ్ సమిధగా మారిందని గురువారం మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. స్థానిక ఇందిరాభవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఇప్పటి దుస్థితి చంద్రబాబువల్లే జరిగిందన్నారు. శుక్రవారం చంద్రబాబు దీక్షచేసే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. దీక్షకు ఎందుకు కూర్చుంటున్నారో కారణాలు ప్రజలకు వివరించాలని అన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. దీక్ష మహాత్ములు పాటించే గొప్ప ఆయుధమని రాజకీయ విన్యాసానికి దీక్షలను ఆయుధంగా చేసుకోవడం ఘోరమన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే రేపు గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేస్తామన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదావద్దని చెప్పిన వ్యక్తిఅని, ప్రతిపక్షాలు ఉద్యమిస్తే అరెస్టుచేయించి, అడ్డగోడు వాదనలు చేశారని, ఎవరైనా ఉద్యమిస్తే జైళ్లకు పంపుతామని అన్న విషయం గుర్తుచేసుకోవాలన్నారు. గుంటూరులో కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీ వస్తే నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారని, ప్యాకేజి ఇచ్చారని వెంకయ్యనాయుడుకు సన్మానం, జైట్లీ అభినందన తీర్మానం చేసి మిఠాయిలు పంచుకున్నారన్నారు. పోలవరం, పట్టిసీమ, భూ కేటాంపు, రాజధాని భూములు అక్రమాలతో కోట్లరూపాయలు దోపిడీ చేశారన్నారు. ప్రజాస్వామ్యం ఎగతాలిగా మారిందన్నారు. ఫిబ్రవరిలో బడ్జెట్ జరిగితే ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరపలేదని, కేవలం లీకులతోనే కాలం గడుపుతున్నారన్నారు. చింతమనేని తహసీల్దార్‌ను కొడితే కార్యాలయాల్లో పంచాయతీనా? అంటూ ప్రశ్నించారు. బొమ్మ చిరిగితే రాద్దాంతమా అన్నారు. చట్టంపనిలో జోక్యం ఎందుకని ప్రశ్నించారు. చట్టం తనపని తాను చేసుకునే స్వేచ్చ ఉండాలన్నారు. సీఎం ఫ్యాక్షన్ లీడర్‌గా మారారన్నారు. రౌడీలు, కాల్‌మనీ, ఇసుక మాఫియా, బోండా ఉమా లాంటివారి అరాచకాలకు ముఖ్యమంత్రే కారణమన్నారు. ప్రజలు బుద్దిచెబుతారు, ప్రజలను రక్షించేందుకు అధికారాన్ని వాడాలని లేకుంటే నీవే బలి అవుతావని హెచ్చరించారు.