కడప

శ్రీ లక్ష్మీనరశింహస్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న భువనగిరిపల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 26: రాజంపేట పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని భువనగిరిపల్లె శ్రీ లక్ష్మీనరశింహస్వా మి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి విశేషమైన విశిష్టత కూడా ఇతిహాసంలో పేర్కొనబడింది. ఇంతటి పవిత్రమైన ఈ క్షేత్రంలో ప్రతిఏడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆల య విశిష్టత తీసుకుంటే కోరిన కోరికలు తీర్చే లక్ష్మీనరశింహస్వామిగా ఈ క్షేత్రంలో స్వామి భక్తుల మదిలో కొలవబడుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఒక కల్యాణం రోజే 50వేల మందికి పైగా భక్తులు హాజరవుతారు. ఆలయ విశిష్టత తీసుకుంటే సుమారు 300 సంవత్సరాల క్రితం భువనగిరిపల్లె వద్ద నుండి కొండపై ఒక వేపచెట్టు క్రింద లక్ష్మీనరశింహస్వామివారి పాదాలున్నాయని, ఇక్కడికి ఒక సాధువు వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉండేవారంటారు. కొండ క్రింద ఉన్న భువనగిరిపల్లె ప్రజలు పశువులు మేపుకునేందుకు కొండపైకి వెళుతూ ఉండేవారని, వీరికి స్వామివారి పాదాల గురించి ఆ సాధువు తెలియజేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తే మీ రు కోరిన కోరికలు తీరతాయని సెలవివ్వడం జరిగింది. ఆ సాధువు పూజలు నిర్వహిస్తూ క్రమేణా లక్ష్మీనరశింహస్వామి మూలవిరాట్టును ప్రతిష్టింపజేసి ఆలయ నిర్మాణం జరిపారు. గేయ కవితా పితామహుడైన శ్రీ అన్నమాచార్యుడు తన స్వగ్రామమైన తాళ్ళపాక నుండి తన అవ్వగారి ఊరైన ఊటుకూరుకు వెళ్ళినప్పుడు ఇక్కడికి సమీపంలోనే ఉన్న భువనగిరిపల్లె కొండపైకి వెళ్ళి స్వామివారి పాదాలను దర్శించుకునేవారని, శ్రీ స్వామివారిని కీర్తిస్తూ కొన్ని కీర్తనలు కూడా అన్నమాచార్యుడు రాసినట్టు పెద్దలు చెబుతారు.
భువనగిరిపల్లె క్షేత్ర మహత్యం
మహావిష్ణువు దశావతారాలలో ము ఖ్యమైనవి శ్రీ నరశింహస్వామి అవతారం లీలావతారం క్రిందకి వస్తుంది. లీల అంటే ఏదో ఒక మహత్తరమైన కార్యాన్ని సాధించేందుకు అవతరించి ఆ ప్రయోజనం తీరిపోగానే అవతారం చాలించడం. దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం ఈ అవతారం ప్రయోజనం. ఈ స్వామిని ఆరాధించడం ద్వారా మనలోని దుర్గుణాలు అంతరించిపోయి దైవ గుణాలు మనసులో అభివృద్ధి చెందుతాయి. భువనగిరిపల్లె క్షేత్రం విషయానికి వస్తే హిరణ్యకశిపుడిని చంపివేసి ఆగ్రహంగా నరశింహస్వామి వెళుతూ భువనగిరి కొండపై కాలుమోపి వెళ్ళినట్టు ఇతిహాసం. అందువల్లే ఈ కొండపై స్వామివారి పాదాలు ఏర్పడ్డాయని, ఈ పాదాలపైనే ఆలయ నిర్మాణం జరిగిందంటారు. నిత్యపూజలు అందుకుంటున్న ఈ క్షేత్రంలో రాజంపేట పట్టణం నుం డే కాకుండా కడప జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు విశేషసంఖ్య లో తరలివస్తుంటారు. ప్రతి శనివారం ఆలయంలో అన్నదానం కూడా జరుగుతుంది. తాజాగా ప్రతి ముఖ్యమైన రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఆలయంలో నిర్వహిస్తున్నారు. సంతానం లేని ఎందరో దంపతులు ఇక్కడి శ్రీ స్వామివారి సన్నిధానం చేరుకుని నియమనిష్టలతో పూజించి వరపడుట ద్వారా సంతానం ప్రాప్తి పొందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. శ్రీ స్వామివారిని ఆరాధించిన ఎందరో నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొంది ఉన్నారు. మరెందరో స్వామివారిని నియమనిష్టలతో ఆరాధించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలను తమ తమ వృత్తి వ్యాపారాల్లో పొందిన వారున్నారు. కొందరు నేతలు స్వామివారిపట్ల భక్తివిశ్వాసములతో ఆరాధించి రాజకీయ విజయాలను కూడా పొంది ఉన్నారు. గ్రహ పీడాదులు నుండి కూ డా విముక్తిని పొంది ఉన్నారు. విశ్వాసంతో కొలిచిన భక్తులందరికి శరణుజొచ్చిన వారందరికి స్వామివారు కొం గుబంగారమై భక్తవరదుడై ఉన్నా రు.
నేడు బ్రహ్మోత్సవాలు మొదలు
భువనగిరి శ్రీ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నుండి ఈనెల 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సం దడి మొదలు కానుంది. శుక్రవారం బ్రహ్మోత్సవాల ప్రారంభంలో భాగం గా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, రాత్రి ధ్వజారోహ ణం జరగనుంది. అలాగే ప్రతి రోజు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు చేశారు.

ఘనంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవం
రాజుపాళెం, ఏప్రిల్ 26: పుణ్య క్షేత్రమైన వెల్లాలలో చెన్నకేశవ సంజీవరాయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సంజీవరాయస్వామి కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణ ఉత్సవాన్ని తిలకించారు. వేద పండితుల మంత్రోత్సరనల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపంపైన కూర్చోబెట్టి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఎదురు కోలాట నిర్వహించి శ్రీదేవి భూదేవి చెన్నకేశవస్మామికి కంకణాధారణ చేసి నెత్తిపై జీలకర్ర బెల్లం వుంచి మంగళ వాయిద్యంల మధ్య పెళ్ళి వేడుకలను నిర్వహించారు. కలియుగ వైకుంఠనాధుడి పెళ్ళిని తిలకించేందుకు కళ్యాణ మండపం భక్తులతో కిక్కిరిసి పోయింది. ప్రతి యేడు ఈ కళ్యాణ వేడుకను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. దేవస్థాన ఛైర్మెన్ దుద్దేల చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు విశ్వనాథరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, జయదేవ్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, ఆలయ సిబ్బంది రాంమోహన్, రఘు, తదితరులు పాల్గొన్నారు.