కడప

ఫోన్‌చేస్తే ఉపాధి పనులు కల్పిస్తాం : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్, ఏప్రిల్ 26: జిల్లాలో ఉపాధి కూలీలుగా గుర్తింపుపొందిన వారికి పనులు లేకుండా ఉన్నట్లయితే ఫోన్‌చేస్తే మరుసటిరోజు నుంచే ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పిస్తామని కలెక్టర్ టీ.బాబూరావునాయుడు తెలిపారు. ఉపాధి పనులు చేసేందుకు ఆసక్తివున్న ఉపాధి కూలీలు ఫోన్:9440748485, 7702201110కు ఫోన్‌చేసి ఉపాధిపనులు పొందవచ్చునన్నారు. గురువారం ఆయన ఉపాధిహామీ అధికారులతో క్లస్టర్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి పనులు చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపిన వారికి పనులు కల్పించివారిని ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఈమేరకు మండలస్థాయి అధికారులకు వౌఖికమైన ఆదేశాలుజారీ చేసినట్లు తెలిపారు. ఆసక్తివున్న వారు మండలస్థాయిలోని క్లస్టర్ అధికారులతో,డ్వామా సిబ్బందితో కలిసి పనులు చేసుకోవచ్చునన్నారు. అయితే వీరికి జాబ్‌కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఉపాధి కూలీలకు పనులుచేసుకునే సమయంలో ఎండ తీవ్రత తట్టుకునేందుకు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.