క్రైమ్/లీగల్

కడప కలెక్టరేట్ భవనంపై ఎక్కి వ్యక్తి ఆత్మహత్యయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 11: ఒకవైపు నిరుద్యోగం...మరోవైపు నాలుగునెలలుగా అందని వేతనాలు..ఉద్యోగం నుండి తొలగించడం..అడిగితే జవాబు చెప్పేవారు లేకపోవడంతో ఆకలి, ఆర్థికకష్టాలతో ఏకంగా వంద మంది నిరుద్యోగులు ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం సంచలనం సృష్టించింది. సాక్ష్యాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వేదిక చేసుకుని ఆత్మహత్యకు సిద్దపడిన హౌసింగ్ కార్పొరేషన్ మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్ల కన్నీటి గాధ ఇది. అందరిలాగానే సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వీరితోపాటు ఇంతవరకు హౌసింగ్ కార్పొరేషన్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేసి ఆకస్మికంగా పదవులు కోల్పోయిన మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్లు తమ ఆందోళన, కష్టాలను అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ప్రధాన కార్యాలయంపైకి ఎక్కి కిందకు దూకేందుకు కొంతమంది మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు. ఒక్కసారిగా సుమారు వందమంది యువకులు ఆత్మహత్యకు దిగేందుకే సిద్దపడటంతో జిల్లా అధికారులు, పోలీసులు పరుగులు పెట్టారు. సోమవారం కావడం, గ్రీవెన్స్ సెల్ ఉండటం ఇందుకు జిల్లా యంత్రాంగమంతా ఇక్కడికి రావడం జరిగిన నేపధ్యంలో మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోవడంతో ఆగ్రహించి ఏకంగా కలెక్టర్ కార్యాలయం ఎక్కి ఆత్మహత్యకు సిద్దపడ్డారు. ఇది గమనించిన కొంతమంది అధికారులు ఆఘమేఘాల మీద కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన అధికారులను హుటాహుటిన వారి వద్దకు పంపారు. ఇదే నేపధ్యంలో కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం భవనంపైకి పరుగులు తీశారు. మీకు న్యాయం చేస్తారు, దిగిరండి అంటూ మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్లకు పదే పదే విజ్ఞప్తి చేయడమేగాకుండా కొంతమంది పోలీసు సిబ్బంది చాకచక్యంగా భవనంపైకి ఎక్కి ఆందోళనకారులను కిందకు తీసుకొచ్చారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు మాట్లాడుతూ 2017 డిసెంబర్ నుండి నాలుగు నెలలుగా తమను వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించుకున్నారని, సకాలంలో భవనాలు పూర్తి చేయాలంటూ రేయింబవళ్లు తమతో పనులు చేయించుకుని ఊహించని విధంగా గతనెలలో తమను విధుల నుండి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇది అన్యాయమని, తాము గత జిల్లా కలెక్టర్‌ను కలిసి పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 212 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను నియమించుకున్నారని, ఇందులో 105మందిని ఆకస్మికంగా తొలగించారన్నారు. గత 10సంవత్సరాలుగా తాము వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా హౌసింగ్ కార్యాలయంలో పనిచేస్తున్నామని, ఏకంగా ఉద్యోగాల్లో నుంచి తీసివేస్తున్నామని ప్రకటించి నాలుగునెలలు పని చేయించుకున్నా జీతం కూడా ఇవ్వడం లేదన్నారు. రోడ్లపాలైన మా పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులను, స్థానిక మంత్రులను ,నేతలను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మరోవైపు ఇతర ఉద్యోగాలకు కూడా అవకాశం లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమను రఘనాథరెడ్డి అనే కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ కింద విధుల్లో చేర్చుకున్నారని, ఒక్కొక్కరి వద్ద నుండి రూ.20వేలు నుండి రూ.40వేలు వరకు వసూళ్లు చేశారని ఆరోపించారు. దీనిపై హౌసింగ్ డిఎం ను సంప్రదిస్తే ఆయన తనకేమాత్రం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా జవాబు ఇస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం వీరు కలెక్టర్‌ను కలవగా తాను ప్రభుత్వానికి నివేదిస్తానని తద్వారా ఏదో ఒక అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తమ ఆందోళన విరమించారు.