కడప

కేంద్ర నిర్ణయంపై భగ్గుమన్న రాజకీయ వర్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 14: రాష్ట్ర విభజన హామీ మేరకు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటును కేంద్రం తుంగలోతొక్కి ఏకంగా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు వీలులేని పరిస్థితులు ఉన్నాయంటూ సుప్రీం కోర్టుకు నివేదించడంపై జిల్లా వ్యాప్తంగా గురువారం నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కేంద్రం నిర్ణయంపై రాజకీయ పక్షాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. అన్నిపార్టీలు తీవ్రస్థాయిలో కేంద్రం నిర్ణయంపై విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల రాస్తారోకోలు, బీజేపీ నేతల ఇళ్ల ముట్టడి, కేంద్ర ప్రభుత్వ శవయాత్రలు, దహనాలు వంటివి సాగించి కేంద్రప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. జిల్లా కేంద్రమైన కడపలో ఏకంగా రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ నేతలు బీజేపీ నేత కందుల రాజమోహన్‌రెడ్డి ఇంటిని ముట్టడించడంతో ఆపార్టీ రాష్టక్రార్యదర్శి రవిశంకర్‌రెడ్డితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టుచేశారు. అలాగే కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారంగా నిలబడి వాహనాల రాకపోకలు అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ సంఘాల నేతలను పోలీసులు అరెస్టులు సాగించారు. కాగా మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపి సిఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల సంస్థ రాష్టచ్రైర్మన్ ఎం.లింగారెడ్డిలు సమావేశం ఏర్పాటుచేసి రెండురోజుల్లో నిరాహారదీక్ష చేపడతామని, ఇందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ ఆందోళనను రూపకల్పన చేస్తామంటూ ప్రకటించారు. అలాగే తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహంవద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పాతబస్టాండులో కేంద్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధంచేయగా, వైసీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఇలా వివిధ పార్టీలు కేంద్రం తీరుపై నిప్పులు చెరిగాయి.

కడప అభివృద్ధిని దగాచేసిన బీజేపీ
రాయచోటి, జూన్ 14: కడప జిల్లా అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం దగా చేసిందని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు వినయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకు బీజేపీ చేసిన మోసాన్ని కుట్రను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ రహదారుల్లో రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి సీమకు అన్యాయంచేస్తే బీజేపీ రాయలసీమను మరింత అగాధంలో తోసిందని, దానికి టీడీపీ, వైసీపీలే సహకరించాయన్నారు. కడప ఉక్కు సాధ్యం కాదని సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలుచేసిన బీజేపీకి, పరిశ్రమల పేరుతో ఉద్యోగాలపేరుతో పేదల భూములు లాక్కొని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఎంతసేపు బూర్జువా పార్టీలు ఉన్న నాణ్యమైన ఖనిజాన్ని కమీషన్లకోసం ఇతర దేశాలకు అమ్ముకునే దానిపై శ్రద్ధతప్ప, నిరుద్యోగులకు ఉపాధి, జిల్లా, రాష్ట్ర తలసరి ఆదాయం పెంచేస్థితిలో లేవన్నారు. ఇదే ఖనిజాన్ని జపాన్ కొని స్టీల్ ఉత్పత్తిచేసి తిరిగి మన దేశానికి వస్తువుల రూపంలో అమ్ముతున్నారన్నారు. ఓట్లు సీట్లు లేవనే ఉద్దేశ్యంతోనే బీజేపీ, టీడీపీలు ఉక్కు ప్యాక్టరీని ఇదిగో ఉక్కు రేపు, మాపూ అంటూ నాలుగేళ్లు ప్రజలను మభ్యపెట్టి ఇపుడు కడప జిల్లా ప్రజానీకాన్ని వంచన చేశారని, కాబట్టి కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడేటట్లుగా సీమ ప్రజానీకం బుద్ధి చెబుతారన్నారు. ఉక్కు ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు.