కడప

కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 17: కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేలలా ఆటోవాలాలకు అండగా ఉంటుందని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామన్న వై ఎస్ జగన్ ప్రకటనకు మద్దతుగాను తెలుగుదేశం ప్రభుత్వం ఆటోలపై జీవితకాలపు పన్ను వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాహనబీమా మొత్తాలను అధికంగా పెంచినందుకు నిరసనగా వైకాపా బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వై ఎస్ జగన్ పాదయాత్రలో వైకాపా అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తాని హామీ ఇచ్చారన్నారు. జగన్ హామీపై ఆటో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. జగన్ ఆటోవాలాలకు వివిధ అవసరాలకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వారిపై కక్షపూరితంగా వ్యవహరించి ఆటోలకు జీవితకాలపు పన్ను వసూళ్లు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ఆటోలకు బీమా మొత్తాలను అధికంగా పెంచడం అన్యాయమన్నారు. ఆటోడ్రైవర్లు వాళ్ల భద్రతో పాటు ప్రయాణీకుల భద్రతపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అనంతరం రాయచోటి ఆటో డ్రైవర్లు చేపట్టిన ఆటో ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని యూనిఫాం ధరించి స్వయంగా ఆటో నడిపారు. ఎమ్మెల్యే ఆటో ఎక్కి ఆటో నడపడంతో ఆటోవాలాలతో పాటు వైకాపా కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. అనంతరం జగనే మా ఆశ అని నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు అన్నారు. ఆటో ర్యాలీని పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి బంగ్లా సమీపం వరకు భారీగా నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే ఆటోలకు లైఫ్ టాక్స్ నిర్ణయాన్ని విరమింపు చేయాలని, అత్యధికంగా పెంచిన బీమా మొత్తాలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి వైఎస్ జగన్ రూ.10 వేలు ఇస్తామని ప్రకటించడం హర్షదాయకమన్నారు. ఆటో డ్రైవర్ల గురించి ఆటోచించిన నాయకుడు జగనేనన్నారు. తమ కుటుంబాలు పడుతున్న కష్టాలను, బాధలను గుర్తించి, ఆలోచించిన గొప్ప వ్యక్తి జగన్ అని కొనియాడారు. జగన్‌తోనే తమ బాధలు తీరుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ ఆధ్వర్యంలో 60 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించాలి
* కేంద్ర గిరిజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్
వీరబల్లి, జూలై 17: మండల పరిధిలోని గ్రామాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించాలని కేంద్ర గిరిజన శాఖ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని వంగిమళ్ల, సోమవరం, పెద్దివీడు, వీరబల్లి, గడికోట తదితర గ్రామాలను ఆయన పర్యటించారు. కేంద్ర కమిటీ సభ్యునిగా పర్యటించి గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా పంపిణీ జరుగుతున్నాయో స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జన్‌ధన్‌ఖాతా కలిగి ఉండాలన్నారు. అదే విధం రూపే కార్డులను పొందాలన్నారు. రేషన్‌కార్డులు కలిగి ఉండాలని, ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అందించాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనన్నారు. ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు తూచా తప్పకుండా గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అందివ్వాలన్నారు. అదే విధంగా ఇంత వరకు బ్యాంకు ఖాతా లేని వారు స్థానిక అధికారులతో సంప్రదించి వెంటనే జన్‌ధన్‌ఖాతా తెరవాలన్నారు. చంద్రన్నబీమా, ప్రధానమంత్రి యోజన బీమా, పీఎం సురక్షబీమా పథకాలలో ఏదో ఒక పథకానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. తద్వారా ప్రమాదవశాత్తూ మరణించినట్లయితే రూ.2 లక్షలు లబ్ది చేకూరుతుందన్నారు. దేశంలోని 117 జిల్లాలు ఎంపిక చేయగా వాటిలో కడప జిల్లా కూడా ఎంపిక చేయడం జరిగిందన్నారు. కడప జిల్లాలో జూన్ మాసం నుండి ఆగస్టు మాసం వరకు 90 గ్రామ పంచాయతీలను పలు మండలాల్లో తాను పరిశీలించి నివేదికలు ఎప్పటిప్పుడు ప్రభుత్వానికి అందిస్తానన్నారు. ఇప్పటి వరకు ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరు తదితర మండలాల్లో పర్యటించామన్నారు. అదే విధంగా వీరబల్లి మండలంలో 5 గ్రామ పంచాయతీలలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఇందులో కొన్ని పథకాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.