కడప

విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించేందుకే పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్,జూలై 17: విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించేందుకే రాష్ట్రప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభా పోటీలు నిర్వహిస్తోందని జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ జి.రామకోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థలో బుధవారం విద్యార్థులకు నిర్వహించనున్న జోనల్ స్థాయి పోటీల సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ రామకోటిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర గ్రంథాలయంలో బుధవారం విద్యార్థులకు జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈపోటీలకు కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతోపాటు తిరుపతికి చెందిన ప్రభుత్వ గ్రంథాలయం నుండి దాదాపు 500 మంది హాజరౌతారన్నారు. కాగా వేసవి సెలవుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం రాష్టమ్రంతా 45రోజులపాటు గ్రంథాలయాల్లో విద్యార్థులకు పలు సాంస్కృతిక అంశాలలో శిక్షణ ఇచ్చారని, శిక్షణ పొందిన వారి ప్రతిభను పరీక్షించి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేందుకు రాష్ట్ర పౌరగ్రంథాలయాల సంస్థ మూడు విడతలుగా పోటీలు నిర్వహించిందన్నారు. ఇందులో భాగంగా బుధవారం జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈపోటీలు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయన్నారు. కాగా విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఆయా రంగాల్లో ప్రముఖులైన న్యాయనిర్ణేతలను నియమించామన్నారు. పోటీల్లో భాగంగా కథలు రాయడం, చెప్పడం, వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, పెయింటింగ్, స్పోకన్ ఇంగ్లీషు, నృత్యాలు, నాటికలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జోనల్ స్థాయిలో నిలిచిన విజేతలకు ఈనెల 24వ తేదిన విజయనగరంలో అయ్యంకి వెంకటరమణ జయంతి పురస్కరించుకుని జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. పాత్రికేయుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సి.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
ఆవులతో నిరసన ధర్నా నిర్వహిస్తాం:సీపీఐ నేతలు
గోసంరక్షణ నినాదం నినాదంగానే ఉందని, మోడమీదపల్లెలో 3వేల ఆవులు మేత లేక చిక్కిశల్యమయ్యాయని సీపీఐకి చెందిన జి.చంద్ర, డి.్భస్కర్‌రెడ్డి, అన్నారు. మోడమీదపల్లె పొలాల్లో ఆవులు తోలుకున్న వారితో వారు మాటామంతి కలిపి వారి కష్టసుఖాలు కనుగొన్నారు. సోమశిల ముంపు ప్రాంతంలోకి తోలుకెళితే ఫారెస్టు అధికారులు వెనక్కుపంపడాన్ని వారు నిరశించారు. చెట్లకు చెట్లే నరుకుతున్న వారిని అడ్డుకోలేని అటవీ సిబ్బంది, ఆవులు, గొర్లు గడ్డి మేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నామని, దేశీయ ఆవులను కాపాడే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నమాటలు ఆచరణలో లేవని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి చొరవ తీసుకుని ఈసమస్యను పరిష్కరించకపోతే ఆవులతో నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తేల్చిచెప్పారు.