కడప

ప్రశాతంగా ఓటువేసేందుకే పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 17: ప్రతి ఒక్కరు ఓటరు సౌకర్యవంతంగా , నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయడమే పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మీకోసం హాల్‌లో ఇఆర్‌వో, తహశీల్దార్లు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణ అంశంపై జేసీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల లొకేషన్ల మార్పు, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు పై ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందన్నారు. వీటిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు చేసే రాతపూర్వక సూచనలు పరిశీలించి ఆ మేరకు ఎన్నికల కమిషన్ వారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,598 పోలింగ్ స్టేషన్లు ఉండగా మార్పులు చేర్పులు వంటివి పరిగణలోకి తీసుకున్న అనంతరం 2,707 పోలింగ్‌స్టేషన్లుగా ప్రతిపాదించడం జరిగిందని జెసి వివరించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 1100మంది ఓటర్లు, పట్టణ ప్రాంతాల్లో1300 మంది ఓటర్లు లోపు వుండే విధంగా స్టేషన్లను హేతుబద్దీకరించడం జరిగిందన్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ హేతుబద్దీకరించిన పోలింగ్ స్టేషన్ల వివరాలు మరికొంత ముందుగా అందించి ఉంటే సంపూర్తిగా సూచనలు చేసేందుకు సౌకర్యంగా ఉండేదన్నారు. ఇందుకు జేసీ మాట్లాడుతూ 19వ తేదిలోపు వారి సూచనలు సమర్పించవచ్చునన్నారు. ఈనెల 20న ప్రతిపాదనలు ఎన్నికల కమిషన్‌కు సమర్పిస్తామన్నారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ కడప నగరంలో లక్ష ఓటర్లు వరకు నమోదు చేయాల్సివుందని తెలుపగా ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల మార్పులు చేర్పులు వంటివి నిరంతరం జరిగే ప్రక్రియ కావున నమోదు విషయం పరిశీలించడం జరుగుతుందని జేసీ తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, టీడీపీ జిల్లాకార్యదర్శి హరిప్రసాద్, కాంగ్రెస్‌పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు లక్ష్మణరావు, సీపీఐ నాయకులు వెంకటశివ, బీఎస్పీ నాయకులు దానంలు సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో జేసీ -2 శివారెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య, ఇన్‌ఛార్జి ప్రత్యేక కలెక్టర్ రామచంద్రారెడ్డి, కడప, జమ్మలమడుగు, రాజంపేట ఆర్డీవోలు పాల్గొన్నారు.