కడప

యుపి పాఠశాలల మూసివేత ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరుమామిళ్ళ, జూలై 19: పని సర్దుబాటు పేరుతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు పంపించి క్రమంగా యుపి పాఠశాలలను మూసివేయాలనుకొనే ప్రభుత్వ ఆలోచనలను విరమించుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) రీజనల్ కన్వీనర్ కె.పుల్లయ్య, కో కన్వీనర్ శ్రీనివాసులు విలేఖరుల సమావేశంలో తెలిపారు. గురువారం ఎస్‌టియు ప్రాంతీయ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాల మధ్య వారధిలా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలలోని ఉపాధ్యాయులను ఇప్పటికిప్పుడు వేరే పాఠశాలలకు పంపిస్తే అందులో చదువుతున్న పిల్లల గతేంటి అని వారి ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలల్లో ఆయా సబ్జెట్లులో ఖాళీగాఉన్న పోస్టులలో సబ్జెట్‌లకు సంబందించిన ఉపాధ్యాయులను కాకుండా వేరే సబ్జెట్‌లకు సంబంధించిన ఉపాధ్యాయులను పంపించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర కళావేదిక కమిటి కో కన్వీనర్ వాకా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆచరణలేని నిర్ణయాలతో ప్రభుత్వ విద్యాసంస్థ గాడి తప్పుతుందన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకుల అరెస్టు అమానుషం
రాజంపేట టౌన్, జూలై 9: ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేయాలని యత్నించేవారిని గృహ నిర్భంధం, అరెస్టులు ముందస్తుగా పోలీసులు చేయడం అమానుషమని ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి సంఘ నాయకులు విమర్శించారు. గురువారం స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో ఆ సంఘాల నాయకులు కాకర్ల రాముడు, వై.సురేష్‌రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుండి పరిపూర్ణనందస్వామిని బహిష్కరించిన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ధార్మికసంస్థలు, సంఘ్ పరివార్, ఇతర భావసారూప్య పార్టీలు, వ్యక్తుల పిలుపుమేరకు గురువారం హైవేలో తలపెట్టిన రాస్తారోకోను దృష్టిలో ఉంచుకుని రాజంపేట, రైల్వేకోడూరులలోని వీహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకుని కార్యక్రమాన్ని భగ్నం చేయడం దారుణమన్నారు. పోలీస్ తీరు రాష్ట్రంలో రాజ్యాంగ పాలన సాగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలేం తరహాలో హిందువులు కూడా కాశీ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రభుత్వం సబ్సిడీ కల్పించాలని, చరిత్రపరంగా భారతదేశాన్ని దోచుకున్న రాజుల పేర్లతో ఉన్న నగరాలను పేర్లు మార్పుచేయాలని వారు డిమాండ్ చేశారు. స్వామిజీ బహిష్కరణను రద్దుచేయకుంటే కోట్లాది మంది హిందువుల ఆగ్రహలకు గురి అయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.