కడప

ప్రభుత్వబడికి తాళం - ఇండ్లకు పరిమితమైన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, జూలై 19: గిరిజన గ్రామంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసేందుకు ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటుచేస్తే గురువారం తాళాలు సైతం తీయలేదు. వివరాల్లోకెళ్తే... మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ రాగిమానుబిడికి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవడంతో బుధవారం కనీసం తాళాలు సైతం తీయకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. అయినా ఈ విషయం అధికారుల దృష్టికి రాకపోగా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఒక ఉపాధ్యాయుడు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆ పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయుడిపైన చర్యలు తీసుకోవడం లేదని గిరిజన గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పాఠశాలకు డీప్యూటేషన్ మీద గురువారం ఒక ఉపాధ్యాయుడిని కానీ లేక ఒక సీఆర్‌పీని కానీ పంపించకపోవడం వెనుక మతలబుఏమిటో అర్థం కావడంలేదు.
ఎంఈవో వివరణ: సుండుపల్లె ఎంఈవో వెంకటేశునాయక్‌ను పాఠశాల తాళాలు తీయకపోవడం ఏమిటని ఆంధ్రభూమి ప్రశ్నించగా ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు సరిగ్గా విధులకు హాజరుకావడం లేదని గ్రామస్థులు తెలపడంతో ఆ ఉపాధ్యాయుడు గురువారం రాలేదని వివరణ ఇచ్చారు. ఇతర ఉపాధ్యాయులనైనా పంపాలని ప్రశ్నించగా ఎవరూ ఆ పాఠశాలకు వచ్చేందుకు మొగ్గు చూపడంలేదని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే డీఈవో వివరణ నిమిత్తం చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

శ్రీ సౌమ్యనాథుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* అంకుర్ఫారణతో ప్రారంభమైన ఉత్సవాలు
నందలూరు, జూలై 19: నారద మునీంద్రులచే ప్రతిష్టంపబడి, అన్నమాచార్యులచే ఆరాధించబడ్డ నందలూరు సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు బస్టాండ్ పరిధిలో బ్రహ్మోత్సవాలచాటే స్వామివారి కటౌట్లు, చిత్రపటాలను విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు సుబ్బరాయశర్మ, సునీల్‌శర్మ, సాయిశర్మ ఆలయంలోని ఉత్సవమూర్తులకు తిరుమంజనంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి దేవతారాధన చేశారు. రాత్రి అంకుర్ఫారణంతో పాటు మృత్యుం గ్రహణం, వాస్తు హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు ధ్వజారోహణం, యాళి వాహనంలో స్వామివారి ఊరేగింపు
సౌమ్యనాధుని బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 10-30 గంటల నుండి 11 గంటలలోపు ఆగమ శాస్త్ర పండితులచే ధ్వజారోహణం నిర్వహించన్నునట్లు పాలకమండలి ఛేర్మన్ పల్లె సుబ్రమణ్యం తెలిపారు. రాత్రి యాళి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు, ఆలయంలో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.