కడప

పరిపూర్ణానంద బహిష్కరణను నిరసిస్తూ విహెచ్‌పి రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 19: ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నగరం నుండి బహిష్కరిస్తూ తెలంగాణ పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం నగరంలోని విశ్వహిందుపరిషత్ నేతలు రాస్తారోకో చేపట్టారు. నగర శివారులోని అలంఖాన్‌పల్లె సర్కిల్‌వద్ద విశ్వహిందుపరిషత్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. వచ్చేపోయే వాహనాలను నిలిపివేశారు. రాస్తారోకో ప్రారంభమైన కొద్దినిమిషాలకే పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరికొంతమంది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, బిఎంఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోగా చేరుకున్నవారిని చేరుకున్నట్లే అరెస్టుచేసి చింతకొమ్మదినె్న పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందే వీహెచ్‌పి సీనియర్ నేత బైరెడ్డి రామకృష్ణారెడ్డితోపాటు మరికొంతమంది సీనియర్లను హౌస్ అరెస్టుచేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని బుధవారమే ఎస్పీకి వినతిపత్రం ఇచ్చామని, అయినా తమ నేతలను గృహనిర్భంధం చేసి తమను అరెస్టుచేయడం హేయమైన చర్య అంటూ వారు విమర్శించారు. తాము పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినా, అరెస్టు చేసినందుకు నిరసనగా వారు చింతకొమ్మదినె్న పోలీసుస్టేషన్‌లో నిరాహారదీక్ష చేశారు. పోలీసుస్టేషన్‌లోనే భారత్‌మాతాకి జై, జైజై భారత్‌మాత అంటూ నినాదాలు చేస్తూకూర్చున్నారు. సాయంత్రం వారిని సొంతపూచీ కత్తుపై విడుదల చేశారు.

పాఠశాలకు డుమ్మాకొట్టిన టీచర్‌పై చర్యకు డిమాండ్
* గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రనాయక్
సుండుపల్లె, జూలై 19: పాఠశాలకు డుమ్మాకొట్టిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్‌చేయాలని గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రనాయక్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్లు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. బుధవారం రాగిమానుబిడికి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రెడ్డ్భిస్కర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నెలకు 20 రోజులు పాఠశాలకు డుమ్మాకొడుతూ రిజిష్టర్లో సీఎల్‌లు వేయకుండా విద్యాశాఖాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మాకొడుతున్న ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్‌చేసి పాఠశాల అభివృద్ధికోసం ఉపాధ్యాయులను నియమించాలని తెలిపారు. పాఠశాల విధులకు సరిగ్గా హాజరుకాకపోయినా పట్టించుకోని విద్యాశాఖాధికారిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అలాగే వారిపైన చర్యలు తీసుకోకపోతే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. అనంతరం విధినిర్వహణ నిర్వర్తించకుండా ఉండే ఉపాధ్యాయులపై ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.