కడప

ఉక్కుపై పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 19: కడప ఉక్కుపరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకుంటే రాయలసీమ ప్రజల కోపానికి గురికాక తప్పదని ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏపీఎస్‌యు రాష్ట్ర అద్యక్షుడు జయవర్ధన్, టీఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు ఆర్‌ఎన్ రాజా హెచ్చరించారు. విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప ఉక్కుసాధనకై ఆగస్టు 3,4వ తేదీల్లో తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రచారంచేస్తూ జిల్లావ్యాప్తంగా చేసిన జీపుజాత గురువారం సాయంత్రం కడప నగరానికి చేరుకుంది. రైల్వేకోడూరులో మొదలుపెట్టిన జీపుజాత రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, పులివెందుల, రాయచోటి మీదుగా నాలుగురోజులపాటు సాగింది. నగరంలో బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ముగింపుసభలో విద్యార్థినేతలు మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో కేంద్రం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా, స్పష్టమైన ప్రకటన చేయకపోవడం క్షమార్హం కాదన్నారు. కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు జరిగితే అనేకమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారన్నారు. కేంద్రం ఆ ప్రయత్నమే చేయకుండా కమిటీల పేరుతో కాలయాపనచేస్తూ రాయలసీమ ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఈనాలుగేళ్లు ఉక్కుపరిశ్రమపై ఏప్రయత్నాలు చేయకుండా, ఈ ఎన్నికల యేడాదిలో ఆర్భాటం చేస్తోందని విమర్శించారు. ఈనెలలో ప్రారంభమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉక్కుపరిశ్రమపై స్పష్టమైన ప్రకటనలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాయలసీమ జిల్లాల నుండి వేలాది మందితో పార్లమెంట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. జాతీయ విద్యాసంస్థలు రైల్వేజోన్ విషయంలో కేంద్రం సవతితల్లిప్రేమ చూపిస్తోందని వారు ఆరోపించారు.