కడప

పుల్లంపేట మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్లంపేట, జూలై 19: పుల్లంపేట మండలంలో గురువారం కలెక్టర్ సీ.హరికిరణ్ సుడిగాలి పర్యటన చేశారు. టి.కమ్మపల్లె యానాదులు ఎదుర్కొంటున్న సమస్యలను విచారించిన కలెక్టర్ వారికి ఈనెల ఆఖరిలోపు ప్రభుత్వ భూములు, పక్కాగృహాలు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. రెడ్డిపల్లెలో తాళ్లపాక జయమ్మ, లక్షుమ్మ, సుబ్బనరసయ్య, బొమ్మవరం సిద్దయ్య మాట్లాడుతూ తమకు పక్కాగృహాలు లేవని, పలుమార్లు అధికారులను వేడుకొన్నా ఫలితంలేదని తమకు న్యాయం చేయాలని వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వారికి వెంటనే పక్కాగృహాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పీఆర్ ఏఇ గంగులయ్య పనితీరు సక్రమంగా లేదని వెంటనే బదిలీకి ఆదేశించారు. మండలంలో వర్మీకంపోస్టు పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదని ఏమి చేస్తున్నావని ఎంపీడీఓ మహ్మద్ హుస్సేన్‌ను నిలదీశారు. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే చర్యలు కఠినంగా ఉంటాయని, ఇకనైనా తీరు మార్చుకుని విధులు నిర్వహించాలన్నారు. అనంతరంగా అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడైనా అధికారులు విధులపట్ల ఆలసత్వం వహించినా, అవినీతికి పాల్పడినా వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు.