కడప

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.285కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,ఆగస్టు 20:రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులను ఆదుకోవడంలో, వారి కుటుంబాల్లో ఆర్థిక బలోపేతాన్ని నింపడంలో రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చేశారని ఆర్‌బీఎస్ రాష్ట్ర బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి సాయినాథ్ శర్మ వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీ ముఖ్యమంత్రి బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలు బ్రాహ్మణులకు అందిస్తున్నట్లు వివరించారు. సోమవారం కడపలోని టీడీపీ కార్యాలయంలో బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో రూ.285కోట్ల నిధులతో లక్ష బ్రాహ్మణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని వెల్లడించారు. జిల్లాలోని 2750మందికి వివిధ సంక్షేమపథకాల కింద నాలుగున్నర కోట్లరూపాయలను ప్రభుత్వం అందించిందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ ఆర్థిక ఫలాలు అందించడంలో తమ ఆర్‌బీఎస్ బ్రాహ్మణ సంఘం రాష్టవ్య్రాప్తంగా కృషి చేస్తోందన్నారు. బ్రాహ్మణ సంక్షేమాన్ని ఆకాంక్షించే ముఖ్యమంత్రి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి చేయూతనిస్తున్నందున బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడుకు ఉంటుందన్నారు.

దోమల వ్యాప్తిని అరికట్టాలి
కడప అర్బన్,ఆగస్టు 20: జిల్లాలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలను చైతన్యపరుస్తూ దోమల వ్యాప్తిని అరికట్టాలని జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రపంచదోమల వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధిని కనిపెట్టిన సర్ రోనాల్డ్ రాస్ మిలిటరీ చిత్రపటానికి తొలుత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సర్ రోనాల్డ్ రాష్ట్ర మిలిటరి సికింద్రాబాద్‌లో పనిచేసే సమయంలో ఆగస్టు 20వ తేదీన దోమయొక్క జీర్ణాశయం గోడల లోపల మలేరియా ప్యారాసైట్‌ను గుర్తించి మలేరియా అనే దోమల ద్వారా వ్యాప్తిచెందుతుందని నిర్థారించారన్నారు. అందువల్ల వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మీకోసం హాల్‌లో దోమలు వ్యాప్తిచెందకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలని జెసి సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు, గ్రామస్థాయి, ఆర్‌డబ్ల్యుఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమల వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో నీటి గుంతల్లో మురికినీరు నిల్వవున్న ప్రాంతాల్లో బ్లీచింగ్‌పౌడర్ చల్లాలని ఎప్పటికప్పుడు డ్రైనేజీ కాలువల్లో మురికిని తొలగించాలన్నారు. నివాస పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచే విధంగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. రాత్రి సమయాల్లో దోమతెరలు వాడాలని ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జేసీ-2 శివారెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి, వైద్యశాఖ అధికారి ఉమాసుందరి, డీఈవో శైలజ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సరస్వతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.