కడప

విద్యుత్ కాంట్రాక్టుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 20:విద్యాత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం విద్యుత్ సౌదా ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు యూనియన్ నాయకులు పలువురు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో కాంట్రాక్టు కార్మికుల డైరెక్టు పేమెంట్, సమానపనికి వేతనం, ఉద్యోగ భద్రత వంటి వ్యవహారాలపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు సమస్యలు పరిష్కరించాలలని సమ్మె చేశామని, అప్పట్లో ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇంతవరకూ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విధి లేని పరిస్థితిలో తాము ఆందోళనకు దిగాల్సివచ్చిందన్నారు. జెన్కో, ట్రాన్స్‌కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందర్నీ విద్యుత్ సంస్థలో విలీనం చేసుకుని యాజమాన్యమే నేరుగా జీతాలు చెల్లించాలని, ఉద్యోగుల అనుభవాలు దృష్టిలో ఉంచుకుని దశల వారీగా ఉద్యోగం క్రమబద్దీకరించాలని, బిల్ కలెక్టర్లకు మీటర్ రీడర్లకు స్టోర్స్‌లో పనిచేసే లోడింగ్ అన్‌లోడింగ్ కార్మికులకు పిఎస్ రేటు విధానం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఫిక్స్‌డ్ విత్తనం కల్పించాలని, జెన్కోలో ప్లాంట్‌లో క్వాలిఫికేషన్ ఉన్నవారు లేనివారు ఉన్నారని విలీన ప్రక్రియ చేపట్టి పనికి సమాన వేతనం చెల్లించాలని వారు కోరారు. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ఐదు నెలల వెటర్నటీ లీవ్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ రంగంలో సర్వీసు ఔట్‌సోర్సింగ్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 29న విద్యుత్ సౌదాలను ముట్టడిస్తున్నట్లు వారు వెల్లడించారు.

సేవా సమితిని ప్రారంభించడం అభినందనీయం
చాపాడు, ఆగస్టు 20: గ్రామాల్లో నూతనంగా పేద ప్రజలకు సేవ చేసేందుకు మానవత్వం పేరుతో సేవా సమితిని ప్రారంభించడం అభినందనీయం అని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పల్లవోలు గ్రామ సమీపంలోని కాశిరెడ్డినాయన వృద్ధాశ్రమంలో మైదుకూరుకు చెందిన తప్పెట శశిధర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన మానవత్వం సేవా సమితిని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా ధృక్పథంతో సంస్థను ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పనులు చేపట్టాలని ఆయన సూచించారు. సంస్థ నిర్వాహకులు శశిధర్ మాట్లాడుతూ రక్త సేకరణ క్యాంపులు, వైద్య శిబిరాలు పేదలకు అవసరమైన కార్యక్రమాలు మా సంస్థ తరుపున చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలు తమకు సహకరించి సంస్థను ముందుకు నడిపేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.