కడప

కల్తి నెయ్యి విక్రయిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 20: పట్టణంలోని విజయనగరం వీధి, గీతాశ్రమం రోడ్డులోని నెయ్యి తయారు చేసే గృహాలలో ఫుడ్ సేఫ్టి అధికారులు దాడులు నిర్వహించారు. కడప జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి డి.నరహర ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టి అధికారి మద్దిలేటి, విజిలెన్స్ అధికారులు లింగప్ప, నాగరాజు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ విజయనగరంలో నాగరాజు అనే వ్యక్తిని, గీతాశ్రమం రోడ్డులో ఉన్న సుధాకర్‌రెడ్డి ఇరువురి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి 252 లీటర్ల కల్తీ నెయ్యిని గుర్తించామని ఈ నెయ్యి విలువ రూ.1,22,000 లు అని శాంపీల్ కొరకు హైదరాబాదులో ఉన్న స్టేట్ ఫుడ్ లాబరేటరీకి పంపిస్తామన్నారు. ఇందులో ఏమైనా కల్తీ ఉన్నట్లు రుజువైతే నెయ్యి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వారు అన్నారు. నెయ్యి తయారిలో డాల్డా, ఇతర వ్యర్థ పదార్థాలను కలిపి నెయ్యి తయారు చేసి నెయ్యి ప్యాకెట్‌పై సరైన బ్యాచ్ నెంబరు, తయారు, గడువు తేదీలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎ ముద్రలు లేకుండా నెయ్యి ప్యాకెట్లును విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. ఎవ్వరైనా తినుబండారాలు కల్తీనూనెతో తయారు చేసి విక్రయించిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అభివృద్ధి కావాలంటే జగన్ సీఎం కావాలి
ఓబులవారిపల్లె, సెప్టెంబర్ 20: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎంపి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎగువ, దిగువ పల్లెలలో గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు ఇంటింటికెళ్లి టీడీపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలు వివరించాలన్నారు. ఎన్నికలలో సీఎంగా జగనన్న అయితే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో, ఏయే సంక్షేమాలు అందిస్తారో అనే అంశాలను ఈ సందర్భంగా వారు ప్రజలకు వివరించారు. నవరత్నాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. దేశం పాలనలో ప్రజా సంక్షేమం నిర్వీర్యమైందని, రైతులు ఆలమటిస్తున్నారని, ఇతర వర్గాల ప్రజలు సంక్షేమాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైఎస్సార్ పాలనలో ప్రతి ఒక నిరుపేదకు సంక్షేమ ఫలాలు నేరుగా ఇంటికే అందాయన్నారు. ప్రతి నిరుపేద హృదయంలో వైఎస్సార్ నిలిచారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగనన్న దాదాపు 3 వేల కిలోమీటర్ల మేరకు ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారన్నారు. వైసీపీ నాయకులు సాయికిషోర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, ఎన్.రాజశేఖర్, అమరా, సురేంద్ర, ఓజి అనిల్ పాల్గొన్నారు.

రాహుల్ గాంధీతోనే రైతు రాజ్యం..: తులసిరెడ్డి
వేంపల్లె, సెప్టెంబర్ 20: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల వలన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, మళ్లీ రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు రావాలని రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ప్రధానమైన దేశం మన రాష్టమ్రని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయరంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండేవన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జునసాగర్, ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ నిర్మించి ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా చేశామన్నారు. జలయజ్ఞం కింద 57 ప్రాజెక్టులు చేపట్టి అందులో 11 ప్రాజెక్టులు పూర్తి చేసి మిగతా ప్రాజెక్టుల్లో సింహభాగాన్ని పూర్తి చేశాయి కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, వ్యవసాయ విద్యుత్ బిల్లుల మాఫీ, లక్ష రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలు, లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ పంట రుణాలు అలాగే సకాలంలో పంటలబీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, అమలు తదితర రైతు అనుకూల కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలుచేశాయన్నారు. 2008లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.70 వేల కోట్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేసి కోట్లాది మంది రైతులను రుణవిముక్తులను చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 64 లక్షలమంది రైతులకు రూ.11.353 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గత 4 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల వలన ఫసల్ బీమా పస లేని బీమాగా తయారైనందున రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ఈ నేపథ్యంలో రైతులను అప్పుల ఊబి నుండి బయటపడేయాలన్నా సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. దీనిపై ఏ ఐసీసీ 84వ ప్లీనరీలో సీడబ్ల్యుసీ సమావేశ తీర్మానంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఈ సమావేశంలో పులివెందుల అసెంబ్లీ కన్వీనర్ వేలూరి శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నకేశవ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబ్రమణ్యం, మండల శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి, రామాంజనేయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తన్న, వెంకటసుబ్బారెడ్డి, షరీఫ్, సుబ్బరాయుడు, కొండయ్య, డీఎంకే పార్టీ జిల్లా అధ్యక్షుడు గూడూరు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.