కడప

న్యాయ వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్,సెప్టెంబర్ 20: బార్యభర్తల మనస్పర్థల కేసుల్లో ఇప్పటికే 11 జంటలను కలిపడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విపరీతమైన గౌరవం పెరిగిందని జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో కుటుంబ వ్యవహరాల కేసులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కోర్టుల్లో వివిధ రకాల విడాకులు, గృహహింస తదితర కేసుల్లో బార్యభర్తల మద్య మనస్పర్థలు కారణంగా కోర్టుచుట్టూ గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారని తద్వారా 11 కేసుల్లో భార్యాభర్తల మద్య కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ ఆర్థిక, పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఉండాలని అన్ని విధాలుగా వారికి నచ్చచెప్పడం ద్వారా పై కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈనెల 22వ తేదీన ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన సదస్సు, ఎల్‌ఎల్‌ఆర్ మేళా కోర్టుప్రాంగణంలో నిర్వహిస్తామని జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు, నాలుగు చక్రాల వాహనదారులు ఎల్‌ఎల్‌ఆర్ కోసం తరలిరావాలని, అలాగే కంప్యూటర్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఫొటో, ఆధార్‌కార్డు, పుట్టిన తేది సర్ట్ఫికెట్లు తీసుకురావాలని, అలాగే ద్విచక్రవాహనదారులు రూ.260లు ఫీజు, నాలుగు చక్రాల వాహనదారులు రూ.310లు ఫీజు చెల్లించాల్సి వుంటుందన్నారు. కాగా 18సంవత్సరాలు నుంచి 50సంవత్సరాలు లోబడి ఉండాలని, 50సంవత్సరాలు దాటిన వారు డాక్టర్ నుంచి ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ తెచ్చుకోవాల్సివుంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూనది
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* తహసీల్దార్ సుబ్రహ్మణ్యంరెడ్డి
చాపాడు, సెప్టెంబర్ 20: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి కుందూనది ద్వారా శ్రీశైలం నీరు తోడుకావడంతో కుందూనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గురువారం జిల్లాలోని కుందూనదిలో 25 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు తహసీల్దార్ సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని నదీ తీర ప్రాంతాల విఆర్‌ఓలతో ఆయన చర్చించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కుందూనది ద్వారా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉందన్నారు. మండలంలోని మడూరు, అన్నవరం, టివోపల్లె, చియ్యపాడు, చాపాడు, ఖాదర్‌పల్లె, సీతారామపురం, అల్లాడుపల్లె, చిన్నగురువలూరు, పెద్దగురువలూరు, కుచ్చుపాప, వెదురూరు గ్రామాల ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి ప్రవాహాన్ని బట్టి రెవెన్యూ అధికారులు పోలీసులు తీరప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అలర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని వర్గ నీటి ప్రవాహంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హెచ్చరించారు

ఆర్టీపీపీకి జాతీయ భద్రతా అవార్డు
* ఏపీ జెన్‌కో డైరెక్టర్ ధర్మల్ చంద్రశేఖర్‌రాజు
యర్రగుంట్ల, సెప్టెంబర్ 20: రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టుకు జాతీయ భద్రతా అవార్డు రావడం గర్వకారణమని ఏపీ జెన్‌కో డైరెక్టర్ ( ధర్మల్ ) చంద్రశేఖర్‌రాజు అన్నారు. గురువారం స్థానిక ఆర్టీపీపీలో జాతీయ భద్రతా అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు డైరెక్టర్ హాజరయ్యారు. ఆర్టీపీపీ సీఈ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రశేఖర్‌రాజు మాట్లాడుతూ గతంలో ఆర్టీపీపీకి ఎన్నో జాతీయ అవార్డులు సాధించిందని అన్ని విభాగాల్లో కూడా ఈ ప్రాజెక్టు అవార్డులు సాధించడం రాయలసీమ వాసులకే కాకుండా ఉద్యోగులకు, కార్మికులకు గర్వకారణమైందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు పొందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా ఇలాంటి అవార్డులు దక్కుతాయని ఈ ప్రమాణాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో 5 యూనిట్లుతో పాటు 600 మెగా వాట్ల 6వ యూనిట్టు కూడా ఉత్పత్తి సాధిస్తూ ఉందని 6 యూనిట్లుతో కలిపి 1650 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన అన్నారు. సీఈ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అవార్డులు ఆర్టీపీపీకి కొత్తేమీ కాదని 1994 నుండి 2004, 2005 సంవత్సరాల్లో పీఎల్‌ఎఫ్ ఉత్పత్తి సాధనలో బంగారు పథకాలను కూడా సాధించిందని గుర్తు చేశారు. దివంగత రాష్టప్రతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్, తదితరుల చేతుల మీదుగా అవార్డులు ఆర్టీపీపీ దక్కించుకుందని గుర్తు చేశారు. సీఈ జనరేషన్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ పరిశుభ్రత ద్వారా 50 శాతం భద్రతను సాధించవచ్చునని, మిగతా 50 శాతం భద్రత ప్రమాణాల ద్వారా సాధించవచ్చని ఆయన అన్నారు. 2014, 2015, 2016 వ సంవత్సరాలకు గాను భద్రతా విభాగంలో రన్నర్‌గాను 2016వ సంవత్సరములో విన్నర్ గాను రెండు అవార్డులను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా డైరెక్టర్ చంద్రశేఖర్‌రాజు అందుకున్నారని అది మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ ఈశ్వరచంద్ర, ఎస్‌ఈ లు దేవేంద్రనాయక్, నరసింహ్మరాజు, నాగరాజరావు, రామసుబ్బారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, సంక్షేమ శాఖ అధికారి తిరుమలరావు, సేఫ్టి అధికారి గోపాలక్రిష్ణ, స్థానిక ఎంపీటీసీ నాగమణి, తదితరులతో పాటు పలువురు ఉన్నతాదికారులు, కార్మికులు, కార్మిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.