కడప

పంట పెట్టుకున్న ఏ రైతు నష్టపోరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 20: జిల్లాలో ఉన్న పశువులకు తగినట్లుగా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేయడంలో, పశువులను కాపాడటంలో కడప జిల్లా పశుసంవర్థకశాఖ చివరి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఈనెల 22వ తేదీన ఆంధ్రపరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనేందుకు కడప జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై గురువారం ముఖ్యమంత్రి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కడప జిల్లాపై అసంతృప్తి కనబరచారు. పంట పెట్టుకున్న ఏ రైతు నష్టపోకూడదని, ఆ రైతుల పంట ఎండిపోకుండా రెయిన్‌గన్స్, ట్యాంకర్ల ద్వారా నీళ్లను సరఫరా చేయాలని, నిధులకు వెనుకాడాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి అన్నారు. పశుసంవర్థకశాఖపై ముఖ్యమంత్రి అసంతృప్తికి కలెక్టర్ సి.హరికిరణ్ సమాధానం ఇస్తూ ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనిచేస్తున్నామన్నారు. ఈ అంశంలో నిరంతరం పశుసంవర్థకశాఖ మంత్రితో మాట్లాడుతూ తగు సలహాలు, సూచనలు తీసుకుంటూ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సీఎంకు వివరించారు. సాగుచేసిన రైతుల పంటలకు సాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏ ఒక్కరైతు పంట నష్టపోకూడదని సీఎం కలెక్టర్‌కు సూచించారు. రెయిన్ గన్‌లు, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని పేర్కొన్నారు. జలవనరుల అంశానికి సంబంధించి రాష్ట్రంలో 63.79శాతం రిజర్వాయర్లలో నీరు ఉందన్నారు. పంచాయతీరాజ్, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌లో సోక్‌ఫీడ్స్ బాగా అభివృద్ధి కావాలని, ఫారం పాండ్స్, అంగన్వాడీ భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ మెడికల్, ఎడ్యుకేషన్,స్ర్తి శిశుసంక్షేమ, ఉపాధిహామీ పథకం, వృద్ధాప్య, వితంతువులు, వికలాంగుల పెన్షన్లు, ఎన్‌టిఆర్ వైద్యసేవ, 108వాహనాల సేవలు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు, బాలామృతం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, అన్న అమృతహస్తం రాష్ట్రంలో ఫలితాలు సాధించి మొదటిస్థానంలో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ ఫలాలు లబ్దిదారులకు చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అప్పుడే అధికారులపై, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రం ప్రధమస్థానంలో ఉందని, ఈజ్ ఆఫ్ లివింగ్ కొత్త కానె్సఫ్ట్ తీసుకొస్తున్నామని సీఎం పేర్కొన్నారు. జూన్, జూలై , ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, జేసీ కోటేశ్వరరావు, డీఆర్వో ఈశ్వరయ్య, ఐసీడీసీ పీడీ పద్మజ, జిల్లాలోని వివిధశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

చంద్రబాబు వల్లే రాష్ట్రం అధోగతిపాలు
* ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న జగన్
* నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు
* ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి, సెప్టెంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసమర్థతతోనే రాష్ట్రం అధోగతి పాలైందని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండల పరిధిలోని గొర్లముదివీడు గ్రామంలోని అరవపల్లె, ఏపిలవంకపల్లె, వల్లూరువాండ్లపల్లె, కొత్తపల్లెలో స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలతో కలిసి సమర్థ నాయకత్వం కోసం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాల పథకాల గురించి వివరించారు. పల్లెపల్లెనా ఎమ్మెల్యే ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. పశుగ్రాసం కొరత వల్ల పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయంటూ రైతన్నలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులకు ఫోన్ చేసి కరవులో పశుగ్రాసం పంపిణీ చేయకపోతే ఇంకెప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితంగా పశుగ్రాసం పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. అపద్దపు హామీలు చెప్పి తమను కష్టాల్లో పడేశారని, చెప్పిన ప్రకారం డ్వాక్రా రుణాలను చంద్రబాబు మాఫీ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందేకు మహిళలు సిద్ధంగా ఉన్నారంటూ వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ప్రతి ఒక్కరినీ మోసం చేశారన్నారు. రాష్ట్రానికి సంజీవిని అయిన ప్రత్యేకహోదాపై చంద్రబాబు ఎన్నో సార్లు మాట మార్చారన్నారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతోందన్నారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను నిలువునా ముంచాడన్నారు. ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది వైఎస్ జగనేనన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే నవరత్నాల పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నిండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి, వైకాపా నాయకులు రాజారెడ్డి, బీసీ నాయకుడు పల్లపు రమేష్, ఎంపీటీసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.