కడప

పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 21: తీవ్ర కరవుబారిన పడిన రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు కడప జిల్లాలో కూడా రైతాంగాన్ని ఆదుకునేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం పంటసాగుచేసి నష్టపోయిన రైతులకు పంట రుణం అందించే పథకంలో జిల్లాను కూడా చేర్పించింది. దీంతో పంట సాగుచేసి తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు ఈ పంట పెట్టుబడిపై ఆశలు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యవసాయశాఖ పంటసాగుచేసి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేందుకు సమాయత్తవౌతోంది. ఇందుకోసం మండలాల వారీగా వివిరాల సేకరణ చేపట్టేందుకు మండల స్థాయి అధికారులకు దిశ దశనిర్దేశం చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందా ఈ-పాస్ ద్వారా ఆన్‌లైన్ చేయించుకున్న రైతులకే పంట రుణం అందిస్తారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకావాల్సివుండగా పంటకోసం రైతులు పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. సాగు మాత్రం కేవలం 40వేల హెక్టార్లలో మాత్రమే పంటసాగుచేశారు. ఇందులో పంటసాగుచేసిన వారు పంటల బీమా కూడా ప్రీమియం చెల్లించారు. అయితే పంటసాగు చేసుకోని రైతులు కూడా పంట రుణం పొంది పంటల బీమాకోసం ఆయా బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు రెండు లక్షల మంది రైతులు పంటరుణాలు తీసుకున్నారు. ఖరీఫ్‌సీజన్‌లో జిల్లాలోని 51 మండలాల్లో వర్షపాతం లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు సాగుచేసుకోలేకపోయారు. కేవలం బోర్లు, బావుల కింద మాత్రమే కొంతమేరకు సాగుచేసుకోగా గత నెలలో శ్రీశైలం నీటిని విడుదల చేయడంతో జమ్మలమడుగు, మైదుకూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో మాత్రమే పంటల సాగుప్రక్రియ సాగింది. కాగా పులివెందుల, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, రాయచోటి వ్యవసాయ డివిజన్లలో పూర్తిగా కరవు నెలకొంది. ఈప్రాంతాల్లో ఎక్కడా ఒక్క ఎకరా కూడా సాగుకాని దయనీయ పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే వ్యవసాయశాఖ ఈనాలుగు డివిజన్లలో ఉన్న పరిస్థితిని రాష్ట్రప్రభుత్వానికి నివేదించింది. ఈ డివిజన్లలో ప్రజలు తాగునీటికే కాకుండా పశువులకు పశుగ్రాసం, నీరు అందించలేని పరిస్థితులు ఉన్నాయని ఓ నివేదికను కూడా అందజేసింది. ఈనేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం జిల్లాల స్థాయి నుండి వచ్చిన నివేదికల ఆధారంగా పంటలు సాగుచేసి తీవ్రంగా నష్టపోయి ఇప్పుడు పంటలు సాగుచేయలేని దుస్థితి ఏర్పడడంతో ఈ ప్రాంతాల్లో రైతులకు పంటల పెట్టుబడికి ఎకరాకు రూ.10వేలు వంతున అందజేయాలని నిర్ణయించింది. ఖరీఫ్‌సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులు, రబీ సీజన్‌లో పంటలు సాగు చేసుకునే అవకాశాలున్నాయని ఈజిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలుసాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించడమేగాకుండా ఈపంటల సాగుకు సుమారు రూ.870కోట్లు రుణాలు అవసరమని వెల్లడించింది. ఈ నేపధ్యంలో రబీసీజన్ వారం రోజుల్లో ప్రారంభంకానుంది. పంటలు సాగుచేసేందుకు రైతుల వద్ద ఆర్థిక స్తోమత లేకపోవడం , పంటలసాగు కూడా అయోమయ పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణ సహాయం కొంతైనా కొన్నిప్రాంతాల్లో రైతులను గట్టెక్కించే అవకాశాలున్నాయని అటు రైతులు ఆశగా ఎదురుచూస్తుండగా వ్యవసాయశాఖ కూడా ఇది మంచి అవకాశంగా భావిస్తోంది. రూ.10వేల రుణానికి సంబంధించిన నిబంధనల మేరకు అర్హత కలిగిన రైతులకు ఈ సహాయాన్ని అందించేందుకు వీలుగా రెండు మూడురోజుల్లో నివేదిక రూపొందించే అవకాశం ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది.