కడప

ప్రజాసమస్యల పరిష్కారం కోసం వైకాపా పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల,సెప్టెంబర్ 24: వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 3వేల కి.మీ.చేరుకోవడంతో ఆయనకు సంఘీభావంగా సోమవారం మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి మూడురోజుల పాదయాత్ర చేపట్టారు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం పైడిపాలెం రిజర్వాయర్ వద్ద మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ఎంపి అవినాష్‌రెడ్డిలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని వైఎస్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. సింహాద్రిపురం మండలం సుంకేసుల, రావులకొలను మీదుగా తొండూరు మండలం బూచుపల్లెకు పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 3వేల కి.మీ.పాదయాత్ర చేయడం చారిత్రకమన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్‌పార్టీ నవరత్నాలను ప్రకటించడం జరిగిందన్నారు. వివిధ ప్రాంతాల వారీగా ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసమే సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం జరిగిందని, ఈప్రజాసమస్యలన్నింటినీ క్రోడీకరించి వాటి పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించి వచ్చే ఎన్నికల మానిఫెస్టోలో రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైకాపా నేతలు ఎన్.శివప్రసాదరెడ్డి, రాష్టక్రార్యదర్శి డి.శివశంకర్‌రెడ్డి, నియోజకవర్గంలోని వైస్సార్ సీపీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.