కడప

స్వచ్చతే జాతిపిత నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,సెప్టెంబర్ 25: జాతి నిర్మాణంలో స్వచ్ఛత, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతే ప్రధాన భూమిక పోషిస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మంగళవారం అన్నారు. నగరంలోని గురుకుల్ విద్యాపీఠ్ స్కూల్ విద్యార్థులతో స్వచ్ఛతహీ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలో టుకేవాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈకార్యక్రమానికి హాజరైన సత్యకుమార్ విద్యార్థులను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ 1919లో జాతిపిత గాంధీజీ కూడా పరిశుభ్రత గురించే చెప్పారన్నారు. శానిటేషన్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ దెన్ పొలిటికల్ ఫ్రీడమ్ అని చెప్పారన్నారు. ప్రధాని మోదీ కూడా ఆ అంశాన్ని స్పూర్తిగా తీసుకుని స్వచ్చతాహీ సేవా కార్యక్రమాన్ని ప్రకటించారన్నారు. ఈకార్యక్రమం కోసం కోట్లాదిరూపాయల నిధులను ఏర్పాటు చేశారన్నారు. ఒక చేత్తో చీపురు, మరో చేత్తో బకెట్ తీసుకుని నగరాన్ని, దేశాన్ని శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ శుభ్రతను దైవత్వంతో పోల్చారన్నారు. 76 ఏళ్లు స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఒకే కుటుంబ పాలనలో గాంధీజీ కన్న కలలు సఫలం కాలేదన్నారు. గాంధీజీ జయంతిని, వర్ధంతిని జరుపుకుంటూ చేతులు దులుపుకుంటున్నాయన్నారు. అక్టోబర్ 2ను బీజేపీ అధినేత మోదీ స్వచ్ఛ భారత్‌ను ప్రకటించారన్నారు. 38శాతం ఉన్న పారిశుద్ధ్యం ఇప్పుడు 92శాతానికి వచ్చిందన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో రోగులు 70శాతానికి తగ్గారన్నారు. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2వరకు స్వచ్ఛత హీ సేవలను ప్రజలందరూ పాటించాలని కోరారు. బొమ్మన ఫౌండేషన్, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు పి.సురేష్‌లు కలిపి ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ టూకేవాక్‌లో అంబేద్కర్, మొల్ల, కోటిరెడ్డిల విగ్రహాలను శుభ్రం చేశారు. అమరులైన నేతల మాటలను, వారి నడవడికను పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుకుంటూనే సామాజిక బాద్యతను అలవర్చుకోవాలన్నారు. భవిష్యత్‌లో వీరే జాతి రత్నాలుగా మెరవాలని ఆయన ఆకాంక్షించారు. శారీరక ధృఢత్వం ఉంటే మానసిక ఉల్లాసం ఉంటుందని అందుకే టుకేవాక్ ప్రారంభిస్తున్నామన్నారు. విద్యాపీఠ్ కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సత్యకుమార్ ఈప్రాంతవాసులందరికీ సుపరిచితుడన్నారు. నరేంద్రమోదీ నాలుగున్నసంవత్సరాలు ఎలాంటి వత్తిడి, అలజడి లేకుండా అన్ని కులాలు, మతాలు సమన్వయంతో జీవించేలా పరిపాలన సాగిస్తున్నారన్నారు. స్వచ్ఛ్భారత్ గాంధీజీ కన్న కలల్లో భాగమన్నారు. దీన్ని ఏర్పాటుచేసి మోదీ స్వయంగా ఆయనే రోడ్లు ఊడుస్తున్నారని అదే మనకు స్ఫూర్తి కావాలన్నారు. బహిరంగ మలవిసర్జన దారుణమని, ఇది మహిళలకు మరింత దుర్భరమని బాధాకరమన్నారు. పిల్లలందరూ మోదీ ఆదర్శంతో ఆయన మార్గదర్శకత్వంలో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.