కడప

అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా వైఎస్‌ఆర్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, అక్టోబర్ 15: అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయితే కుట్రలు, మోసాలకు చంద్రబాబు పెట్టింది పేరని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తాను దాదాపుగా 50 రోజుల నుంచి గ్రామాల్లో పర్యటిస్తున్నపుడు ఇంటింటా తిరిగి ప్రతి ఇంట్లోని వ్యక్తులను కలుస్తున్నపుడు ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యక్తపరిచిన అంశాల్లో చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యంగా వారి మాటల్లో వైఎస్‌ఆర్ అంటే 108, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, అందరికీ పక్కాగృహాలు, అర్హులందరికీ పింఛన్లు, ఉపాధి హామీ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబునాయుడు అంటే ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దుర్వినియోగం చేస్తూ ఆయన తిరిగే విలాసాలకు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు దోచుకునే నీరు-చెట్టు, పనికి ఆహార పథకం పేరుతో టన్నుల టన్నుల బియ్యం అమ్ముకున్న అవినీతి, కులతత్వం, అసత్యాలు, మోసాలు, కుట్రలు గుర్తుకు వస్తాయని ప్రజలే చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. అదే రాజశేఖర్‌రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడాగా ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. ఈ రోజు వ్యవసాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసినా కొద్ది శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఫీజురీయింబర్స్‌మెంట్‌తో చదివించుకోవడంతో వారు సాఫ్ట్‌వేర్ తదితర రంగాల్లో రాణిస్తుండటం వల్ల కొద్దో గొప్పో సంతోషంగా ఉన్నారన్నారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఆ రోజుల్లో వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఈ రోజు కూలీలకు జీవనం జరుగుతోందన్నారు. లేకుంటే వలసలు అధికమై పల్లెలన్నీ ఖాళీ అయి ఉండేవన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వ్యవసాయంలో కానీ, ఉద్యానవన పంటల సాగుతో బాగా ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా రైతులకు సహాయపడతారన్నారు. ఇటు గాలేరు-నగిరి, హంద్రీనీవా పథకాల ద్వారా రాబోయే రోజుల్లో రాయచోటి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటితో నింపుతామన్నారు. ఉన్న భూములను ఇళ్లూ వాకిలీ వదిలి బతుకుదెరువు కోసం గల్ఫ్, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లి అష్టకష్టాలు పడుతున్న ప్రజలు తిరిగి తమ సొంత గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకొని ఆనందంగా జీవించేలా కృషి చేస్తామని, మళ్లీ పల్లెలు కళకళలాడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.