కడప

సీపీఐ కరవు ధర్నాపై పోలీసుల జులుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 15:తీవ్ర వర్షాభావం ఏర్పడి పంటలు లేక అల్లాడుతున్న రైతులకు, రైతు కూలీలకు కరవు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ చేపట్టిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం పోలీసుల అత్యుత్సాహం, జులుంతో ముగిసింది. ఇటీవల పోలీసులు, ప్రజాస్వామికంగా జరిగే నిరసనలను కూడా ఆదిలోనే అడ్డుకుని అరెస్టులు చేసి నీరు గారుస్తున్నారు. అదే పంథాలో సోమవారం జరిగిన సీపీఐ చలోకలెక్టరేట్ ఆందోళనను కూడా అరెస్టులతో అణచివేశారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయమైన హోచిమిన్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరే ప్రయత్నంలో ఉండగానే పోలీసులు కనిపించిన వారిని కనిపించినట్లు అరెస్టుచేసి పోలీసుస్టేషన్లలో నిర్భంధించారు. పోలీసు బలగాలను తప్పించుకుని కొందరు సీపీఐ కార్యకర్తలు, నేతలు ఎర్రముక్కపల్లి వద్ద నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద అంతకుముందే భారీ బందోబస్తుతో ఉన్న పోలీసులు, సీపీఐ దండు అక్కడికి చేరీ చేరగానే అరెస్టుచేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఈ సమయంలో పోలీసులకు, సీపీఐ నేతల నడుమ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆందోళనకారులకు స్వల్పగాయాలయ్యాయి. మరికొంతమంది ఉద్యమ కారులు కలెక్టరేట్ సభాభవన్‌లోకి చొచ్చుకుపోయారు. లోపలికి చొచ్చుకుని పోయిన వారిపై పోలీసులు లాఠీ ఝళిపించారు. పిడిగుద్దులతో కొట్టి అరెస్టుచేశారు. అరెస్టుచేసిన వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి చింతకొమ్మదినె్న పోలీసుస్టేషన్, వన్‌టౌన్ పోలీసుస్టేషన్, చిన్నచౌకు పోలీసుస్టేషన్లకు తరలించారు. కలెక్టరేట్ వద్ద కనీసం ఒక అర్ధగంట కూడా సీపీఐ కార్యకర్తల నిరసనను పోలీసులు ప్రదర్శించనీయక పోవడం గమనార్హం.

కరవుసాయం అడిగితే ఖాకీలతో కొట్టిస్తారా
కరవువాతన పడిన జిల్లా రైతాంగానికి, రైతు కూలీలకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేయాలనుకున్న వారిని ఖాకీలతో కొట్టిస్తారా? అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు- అంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య తీవ్రస్వరంతో ప్రశ్నించారు. అరెస్టయి చింతకొమ్మదినె్న పోలీసుస్టేషన్‌లో ఈశ్వరయ్య పాత్రికేయులతో మాట్లాడారు. జిల్లాలోని 51 మండలాల్లో ఈ ఏడాది కరువు విలయతాండవం చేస్తోందని, 2018 ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం ఒక లక్షా 33వేల 556 హెక్టార్లకు గాను అన్ని పంటలు కలిపి కేవలం 44వేల 189 హెక్టార్లు మాత్రమే సాగయ్యాయని, అవి కూడా వానలేక నిలువునా ఎండిపోయాయని అన్నారు. చీనీ, మామిడి రైతులు ట్రాక్టర్లతో నీటిని తోలుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయని అన్నారు. వరుస కరవులతో పెట్టిన పెట్టుబడులు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చలేక వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల వత్తిళ్లతో రైతులు అవమాన భారంతో ఆత్మహత్యల వైపు చూస్తున్నారని ఈశ్వరయ్య అన్నారు. పశువులకు మేత లేక కబేళాలకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతుకుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన పరిహారం ఇవ్వడంలో కూడా, త్రీమెన్ కమిటీ నివేదిక పంపక తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. 2012-13రబీలో బుడ్డశెనగకు జాతీయ పంటల బీమా సంస్థకు ప్రీమియం చెల్లించిన రైతుల్లో ఇంకా 20వేల మందికి రూ.112కోట్లు, 2014-15లో ప్రీమియం చెల్లించిన రైతులు 25వేల మందికి రూ.6.92కోట్లు బీమా పరిహారం అందలేదని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి పసల్‌బీమా యోజన కింద ఐసీఐసీఐకి ప్రీమియం చెల్లించిన 11,860 మందికి రూ.34వేల 194కోట్లు 2016-17వ సంవత్సరానికి రావాల్సివుందన్నారు. అలాగే 2017-18 సంవత్సరానికి పీఎం పసల్‌బీమా కింద 2,455మందికి రూ.34.28కోట్లు రావాల్సివుందన్నారు. అకాలవర్షాల వల్ల అరటి, బొప్పాయి, మామిడి, చీనీ లాంటి ఉద్యానపంటలు నాశనమయ్యాయని, వీటికి కూడా పంటల బీమా రాలేదని అన్నారు. కరవుపీడిత గ్రామాల్లో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తే కానీ రైతులు కోలుకోలేరని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ, పరిహారం పూర్తిగాక దశాబ్దాలు దాటుతున్నాయని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పేదలకు పంచిన సాగుభూమిని క్షేత్రస్థాయిలో రైతులకు చూపించకుండా అధికారులు సహకారం అందించడం లేదని వాపోయారు. ఈ కరవుకాలంలో విద్యార్థులకు అన్నిరకాల ఫీజులు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పశువులకు పశుగ్రాసాన్ని, దానా ఉచితంగా పంపిణీ చేసి ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.