కడప

భూనిర్వాసితులందరికీ పరిహారం అందజేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివీడు, అక్టోబర్ 15: తూముకుంట, వెలిగల్లు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పవర్‌ప్లాంటు ద్వారా భూమలు కోల్పోయిన భూనిర్వాసితులందరికీ భూపరిహారం అందించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తూమకుంట గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లె సమీపంలో నిర్మించిన డంపింగ్‌యార్డును, తూముకుంట కస్పా, ఆవులవాండ్లపల్లె, మదార్‌సాబ్‌గారిపల్లెలో ఏర్పాటు చేసిన సిమెంట్‌రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన సోలార్‌పవర్‌ప్లాంటును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ పవర్‌ప్లాంటు ద్వారా భూములు కోల్పోయిన పట్టాదారు రైతులు, డీకేటీ భూముల రైతులు, చుక్కల భూముల రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా పరిహారం అందించేందుకు తాను కలెక్టర్‌తో చర్చిస్తానన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మరో 15 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు రవీంద్రబాబు, నూలివీడు, గాలివీడు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్లు వెంకటశివారెడ్డి, ఈశ్వరరెడ్డి, మాజీ సర్పంచులు వీరభద్రప్పనాయుడు, మహమ్మద్‌రియాజ్, చిన్నపరెడ్డి, టీడీపీ నాయకులు రామమోహన్‌నాయుడు, కదిరినాయుడు, ప్రభాకర్‌రెడ్డి, వీరరాఘవులు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు శివ, వక్ఫ్‌బోర్డు మాజీ మెంబర్ మహబూబ్‌బాష, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు లక్షుమయ్య, టీడీపీ ఉపాధ్యక్షులు పార్థసారథిరెడ్డి, గండిమడుగు దేవస్థాన ఛైర్మన్ గంగులప్ప, డీలర్లు మహబూబ్‌బాష, ఖాసీంఖాన్, పూలికుంట టీడీపీ యూత్ తదితరులు పాల్గొన్నారు.