కడప

అవసరం మేరకే గండికోట నీటిని విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, నవంబర్ 14: అవసరాల మేరకు గండికోట రిజర్వాయర్ నుండి నీటి విడుదల చేపట్టాలని కలెక్టర్ హరికిరణ్ జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం మైలవరం పర్యటన అనంతరం గండికోట రిజర్వాయర్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గండికోట రిజర్వాయర్‌కు సంబంధించి నీటినిల్వలు, విడుదలలు వంటి విషయాలపై ఆరా తీశారు. అవసరం మేరకు చిత్రావతి, సర్వారాయ సాగర్‌లకు నీటి విడుదల చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో పర్యాటక రంగం అభివృద్ది చెందుతున్నందున ప్రాజెక్టు సందర్శనకు ప్రముఖులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రాజెక్టువద్ద శాశ్వత హెలిపాడ్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.