కడప

సీఎం రాకకు..యుద్ద ప్రాదికన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, నవంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉక్కు పరిశ్రమ ఏర్పాట్లకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్ మాసంలో పర్యటనకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ఉక్కు పరిశ్రమస్థాపనకు శంకుస్థాపనతో పలు పనులకు శంకుస్థాపనలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ బుధవారం నియోజకవర్గంలో పర్యటించారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంతంకు సౌకర్యవంతమైన రోడ్లు ఏర్పాట్లకు ఆదేశించారు. జిల్లాలో ప్రత్యేక పర్యాటక కేంద్రమైన గండికోట నుండి సుమారు రూ.500 కోట్లతో ఏర్పాటుచేయనున్న రోప్‌వే విషయంపై అధికారులతో చర్చించారు. గండికోట వైపు నుండి అగస్తేశ్వర కోనవైపు రోప్ వే వచ్చే ప్రాంతం వరకురోడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. గండికోటను సందర్శించే పర్యాటకులకు రోప్‌వేద్వారా ఇవతలివైపున ఉన్న పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ అగస్తేశ్వరకోన, దత్తముని కోన, శ్రీ గుర్రప్పస్వామి కోన, కంబాలదినె్న మారెమ్మ, ఉక్కు పరిశ్రమ ప్రాంతాలన కలిపే విధంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకు సంబంధించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో త్వరలో గండికోట రోప్‌వే, టూరిజం సర్క్యూట్‌లకు డిసెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనతో మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.