కడప

ఉక్కు శంకుస్థాపనకై ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, నవంబర్ 14: కడప జిల్లాలో ఏర్పాటుచేయనున్న ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ఏర్పాట్ల పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. మండలంలోని ఎం.కంబాలదినె్న గ్రామంలో బుధవారం కలెక్టర్ పర్యటించారు. ఇందులో భాగంగా కంబాలదినె్న గ్రామానికిచేరే మార్గాలైన రూట్ మ్యాపులను, భూములకు సంబంధించిన వివరాలను మ్యాపులను పరిశీలించి అధికారుల ద్వారా ఆరాతీశారు. పరిశ్రమ ఏర్పాటువిషయం, పొలాల్లో సాగుచేస్తున్న పంటలు, నీటివసతి వంటివాటిపై కలెక్టర్ పొలాల్లోని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కంబాలదినె్నవద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయడంలో భాగంగా డిసెంబర్ మాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన కార్యక్రమంనకు విచ్చేయనున్నారన్నారు. ఏర్పాట్లలో భాగంగా ప్రధాన రోడ్లు, భూములకు సంబంధించిన వివరాలు, స్థానికుల అభిప్రాయం వంటి అంశాల పరిశీలించామన్నారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలోని దాల్మియా సిమెంటు పరిశ్రమ నుండి సి.కొత్తపల్లె మీదుగా గంగుల నారాయణపల్లె, పొన్నంపల్లె గ్రామాల మీదుగా కంబాలదినె్న వరకు ఉన్న రోడ్డును, మండల కేంద్రమైన మైలవరం నుండి గుర్రప్పస్వామి కోనమీదుగా కంబాలదినె్న వరకు రోడ్డును రెండువరుసల రోడ్డుగా యుద్దప్రాతిపదికన ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. మైలవరం నుండి కంబాలదినె్నవరకు ఉన్న రోడ్డు ప్రస్తుతం ఒక వరుస రోడ్డుకు టెండర్లు కూడా పూర్తయినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. వాటికి అదనంగా ఒకేసారి రెండు వాహానాలు వెళ్లేలా రోడ్డును వేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోపు రూట్‌మ్యాపు పనులు పూర్తిచేస్తే తదుపరి ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్నారు.