కడప

చంద్రబాబును బీసీలు నమ్మేస్థితిలో లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్రంలోని బీసీవర్గాలు నమ్మేస్థితిలో లేరని రాజంపేట పార్లమెంటరీ వైసిపి బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్ తెలిపారు. గురువారం రాజంపేటలో నిర్వహించిన పార్టీ బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను చంద్రబాబు నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేశారన్నారు. టీడీపీకి ఓటు బ్యాంకు రాజకీయాలుతప్ప అభివృద్ధి పట్టడంలేదని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల్లో బీసీలకు 110 హామీలిచ్చి ఇంతవరకు ఒక హామీ కూడా నెరవేర్చకపోవడం చాలా దారుణమన్నారు. ఎన్నికల ముందు బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఆధార్‌తో సంబంధం లేకుండా అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకై బీసీలకు సబ్సిడీలు మంజూరు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదన్నారు. అద్దె భవనాల్లో ఉన్న బీసీ హాస్టల్స్‌కు రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంతభవనాలు నిర్మిస్తామనిచెప్పి ఇంతవరకు ఆ ఊసే పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. చేనేత కార్మికులకు బ్యాంకు రుణామాఫీ, పవర్‌లూమ్‌పై ఉన్న రుణాలురద్దు చేస్తామని, రాష్ట్ర వ్యాపితంగా నేత బజారులుఏర్పాటు చేస్తామని, జిల్లాకు ఒక చేనేత పార్కు ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ, ఉపాధి కల్పిస్తామని, 1.5లక్షలతో ఉచిత ఇళఉల, మగ్గం షెడ్డు, ఏర్పాటు చేస్తామని, చేనేత సొసైటీలకు 20శాతం రాయితతీపై ముడి సరుకులు సరఫరా చేస్తామని, మగ్గాలకు ఉచిత విద్యుత్తు అని ఇచ్చిన హామీల మాట ఏమైందో అంతుపట్టదన్నారు. గీత కార్మికులకు సంబంధించి చీప్ లిక్కర్, గుడుంబా, మద్యం బెల్ట్ షాపులను తొలగిస్తామని, తాటి తోపుల పెంపకం కోసం ఆయా గ్రామాల్లో భూమి ప్రత్యేకంగా కేటాయిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలన్నారు. గొర్రెల కాపరులకు రైతు బజార్ మాదిరిగా మేకలు, గొర్రెలు విక్రయ బజారులు ఏర్పాటు చేస్తామని, యాదవ, కురువ, గొర్రె కాపరులు అన్ని ఆధారిత వృత్తులకు ప్రాధాన్యత నిచ్చి ప్రోత్సహకాలు, రాయితీలు ఇస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చి నేడు వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు. గొర్రెల మేత కోసం ఆయా గ్రామాల్లో భూముల కేటాయింపు ఏమైందో తెలియడం లేదన్నారు. రజకులను ఎస్సీలలో చేరుస్తామని, అవసరమైన ప్రతి గ్రామంలో దోబీఘాట్‌లు నిర్మిస్తామని, నారుూ బ్రాహ్మణులకు డోలు, సన్నాయి, తదితర వాయిద్య కళాకారులకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఇలాగే ముదిరాజులు, వడ్డెరలు, స్వర్ణకారులు, మెదరులు, కుమ్మరులు, కంచరులు, వడ్రంగి, కమ్మరి, శిల్పులు, దూదేకులు, తాపీ పనివారు, గాండ్ల, ఉప్పర, పూసర, కురవ, వాల్మీకి కులాలన్నింటికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన చంద్రబాబు ఇవాళ ఆదరణ అని మళ్లీ బీసీలను మభ్యపెడుతున్నారన్నారు. బీసీలు అభివృద్ధి చెందారంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సాధ్యమైందన్నారు.