కడప

జిల్లాపై చంద్రబాబు కక్షసాధిపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, నవంబర్ 15: కడప జిల్లాను వైయస్ కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారన్న ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అందులో భాగంగానే కేసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వకుండా చేస్తున్నారని జిల్లా వైకాపా రైతువిభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో మండల వైకాపా నాయకులు కానాల జయచంద్రారెడ్డితో కలిసి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కేసీ కెనాల్‌కు సంబంధించి దాదాపు 130 సంవత్సరాలు కల చరిత్రగల కేసీ కెనాల్ రైతాంగానికి కనీసం ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పేవారు లేరన్నారు. మొదట్లో టీడీపీ నాయకులు పరాక్రమాలుపలికి ఈ సంవత్సరము కేసీ కెనాల్ కింద రైతులకు రెండవ పంటకుకూడా నీరు విడుదల చేస్తామనిచెప్పి ప్రస్తుతం ప్రజలకు వారి మొఖాలను కూడా చూపించలేకపోతున్నారన్నారు. తుంగభద్ర డ్యాం నుండి దాదాపు 180 టియంసిల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు రావడం జరిగిందని మరి 40 టియంసిలు కేసీకి నీరు కేటాయింపు ఉన్నప్పటికీ నీరు వదలకుండా ఉండటం రైతులను మోసగించడమే అన్నారు. ప్రస్తుతం వస్తున్న కేసీ కెనాల్ నీటిని చాపాడు, కొండపేట కాల్వలకు రైతులు స్వంతంగా వంతుల వారిగా వాడుకుంటున్నారని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి రాజోలి ఆనకట్ట నిర్మాణానికి నాంది పలుకితే తదుపరి వచ్చిన ముఖ్యమంత్రులు రాజోలి ఆనకట్టను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాజోలి, గుండ్రేవుల రిజర్వాయర్ చేపట్టి ఉంటే ఈపాటికే రెండు పంటలకు సరిపడ నీరు ఉండేదన్నారు. అలాగే బ్రహ్మంసాగర్‌కు పూర్తిస్థాయిలో నీరు ఇస్తామని ఇప్పుడు 3 టియంసీల నీరులేవని బద్వేలు, బ్రహ్మంగారిమఠం ప్రాంతాలలో త్రాగు నీటి సమస్య వస్తుందని రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులకు ఎప్పుడు చంద్రబాబును పొగడడమేతప్ప జిల్లాలోని కాల్వలకు నీరు తెప్పించి రైతులకు మేలుచేద్దామనే చింతలేదన్నారు. ఇప్పటికైనా కేసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరు ఇచ్చిపంటలు ఎండిపోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు జిల్లా అధికారం ప్రతినిధి ఎం.రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె రామయ్య, సుబ్బయ్య, వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.

స్వైన్‌ఫ్లూపై విస్తృత ప్రచారం

ప్రొద్దుటూరు, నవంబర్ 15: రాష్ట్ర, జిల్లాలలో స్వైన్‌ఫ్లూ వ్యాధిసోకి ఎంతోమంది మరణిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య వైద్య సిబ్బందితో ప్రజలకు తెలిసే విధంగా విసృత ప్రచారం చేయడం జరుగుతుంది. వీటిలో భాగంగా గురువారం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో కో అర్డినేటర్ నాగజ్యోతి ఆధ్వర్యంలో స్వైన్‌ఫ్లూపై ఆ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్వైన్‌ఫ్లూ రాకుండా జాగ్రత్త వహించాలని ఏడబ్ల్యుడబ్ల్యులు తెలిపారు. ఈ సందర్భంగా సిఓ నాగజ్యోతి మాట్లాడుతూ జిల్లాలో కూడా స్వైన్‌ఫ్లూకు గురై చనిపోవడం జరుగుతున్నారని స్వైన్‌ఫ్లూ పట్ల అజాగ్రత్త వహించడమే దీనికి కారణం అన్నారు. అజాగ్రత్త వహించకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్త వహించాలని ఇతర వ్యక్తులు మన దగ్గరగా ఉండి తుమ్మిన, దగ్గినా నోటి నుండి వెలువడే తుంపర్లు ద్వారా స్వైన్‌ఫ్లూ వ్యాధి ఆ వ్యక్తికి అందుబాటులో ఉన్నవారికి కూడా వ్యాపిస్తుందన్నారు. తల నొప్పి, జ్వరం, దగ్గు, జలుబు, ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలని ఏ వ్యక్తికి కూడా ఇలాంటివి సంభవించినప్పుడు వెంటనే డాక్టర్లును సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి గురించి తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఔషదాలను వేసుకోవాలని ఆమె ఆ ప్రాంత ప్రజలకు సూచించారు. ఈ మందులు వాడటంవల్ల ఎటువంటి ఆరోగ్య కరమైన ఇబ్బందులు ఉండవని కావున చిన్న పిల్లలకు మొదలుకొని ప్రతి ఒక్కరూ స్వైన్‌ఫ్లూ రాకుండా ఈ ముందస్తు మందులను వాడాలని వారు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడబ్ల్యుడబ్ల్యు శ్యామల, బాలబయమ్మ, ఆ ప్రాంత మహిళలు పాల్గొన్నారు.